Dark Circles Prevention: మారుతున్న కాలాలకు అనుగుణంగా యువతలో అలవాట్లు క్రమంగా మారుతున్నాయి. వయసు రీత్యా కొంతమంది కళ్ల కింద నల్లని వలయాలు ఏర్పడుతున్నాయి. కానీ, ఈరోజుల్లో యువత కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. తీవ్ర ఒత్తిడి, ఎక్కువ సేపు కంప్యూటర్ లేదా మొబైల్ చూడడం వల్ల ఇలాంటి సమస్యకు కారణం కావొచ్చు. అయితే ఈ నల్లని వలయాలను రూపుమాపేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టామాట రసం


టమాట రసంతో చర్మాన్ని మృదువుగా మారేందుకు సహకరిస్తుంది. కొద్దిగా టమాటా రసం లేదా గుజ్జులో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి కంటి కింద ఏర్పడిన డార్క్స్ సర్కిల్స్ పై అప్లే చేయాలి. పది నిమిషాల తర్వాత దాన్ని నీటితో కడిగేయడం వల్ల నల్లని వలయాలు మాయం అవుతాయి. 


ఆలూ మిక్స్


పచ్చి బంగాళదుంపలను మెత్తగా చేసుకొని.. దాని ద్వారా వచ్చిన రసాన్ని కంటి కింద నల్లని వలయాలపై అప్లై చేయాలి. ఆ రసంలో దూదిని ముంచి సున్నితంగా ఆ ప్రదేశంలో మర్దన చేయాలి. అలా పది నిమిషాల తర్వాత నీటితో కడిగేయాలి. 


పాలు


పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే పాలతో చర్మానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. కళ్ల కింద ఏర్పడిన నల్లని వలయాలను తగ్గించేందుకు పాలను ఉపయోగించవచ్చు. చల్లని పాలలో దూదిని నానబెట్టి.. ఆ తర్వాత డార్క్ సర్కిల్స్ పై అప్లే చేయాలి. కొద్ది సమయం తర్వాత నీటితో కడిగేయాలి. 


నారింజ రసం


నారింజ రసంతో కంటి కింద నల్లని వలయాలకు స్వస్తి చెప్పవచ్చు. ఆరెంజ్ జ్యూస్ లో గ్లిజరిన్ డ్రాప్స్ ను వాడటం వల్ల కార్నియా క్రమంగా తగ్గిపోయి.. చర్మానికి కాంతివంతంగా చేస్తుంది.


యోగా / ధ్యానం


ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణల వల్ల కూడా కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి. ఈ సందర్భంలో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు యోగా లేదా ధ్యానం చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. 


(నోట్: పైన అందజేసిన సమాచారమంతా నిపుణులను సలహాలు, సూచనలు అనుసరించి రాసినది. వీటిని పాటించే ముందు తప్పక వైద్యుడి సలహాను తీసుకోవడం మంచిది. ZEE తెలుగు News ఈ సమాచారాన్ని ధ్రువీకరించడం లేదు.)  


Also Read: Turmeric Remedies: పసుపుతో ఇలా చేస్తే మీ సమస్యలన్నీ తొలగి.. డబ్బు కొరత తీరుతుంది..


Also Read: Face Mask Beauty: చందమామలా మెరిసే ముఖసౌందర్యం కోసం ఈ టిప్స్ పాటించండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook