Face Mask Beauty: చందమామలా మెరిసే ముఖసౌందర్యం కోసం ఈ టిప్స్ పాటించండి!

Face Mask Beauty: అందంగా, యవ్వనంగా ఉండేందుకు అటు స్త్రీలతో పాటు ఇప్పుడు పురుషులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజుల్లో ముఖ సౌందర్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహిస్తున్నారు. కానీ, బిజీ లైఫ్ వల్ల తమ ముఖసౌందర్యాన్ని సంరంక్షించుకునేందుకు సమయం ఉండడం లేదు. అటువంటి వారు రాత్రి పడుకునే ముందు ఈ టిప్స్ పాటిస్తే మీ చర్మం కాంతివంతంగా మారుతుంది.    

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 24, 2022, 03:40 PM IST
Face Mask Beauty: చందమామలా మెరిసే ముఖసౌందర్యం కోసం ఈ టిప్స్ పాటించండి!

Face Mask Beauty: ఈరోజుల్లో స్త్రీలు, పురుషులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ ముఖ సౌందర్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. కానీ, బిజీ వర్క్ వల్ల చాలామందికి చర్మాన్ని సంరక్షించుకునే సమయం ఉండడం లేదు. దీని ప్రభావం ముఖంపై స్పష్టంగా కనిపిస్తుంది. మీరు అలాంటి సమస్యను ఎదుర్కొంటుంటే.. వెంటనే మీ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఉదయం పూట ముఖాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి సమయం చాలదు. ఈ క్రమంలో రాత్రి పడుకునే ముందు ముఖానికి ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల.. ఉదయాన్నే చర్మం మెరుస్తుంది. అలా రాత్రి పూట ముఖంపై వేసుకునే మాస్క్ లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

పుచ్చకాయ రసం

పుచ్చకాయలో విటమిన్ ఏ, విటమిన్ సి సహా అనేక ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. పుచ్చకాయ పండ్ల రసాన్ని తీసుకుని కాటన్‌తో ముఖంపై మాస్క్ లా అప్లే చేసుకోవాలి. ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఆ మాస్క్ ను కడిగేయాలి. పుచ్చకాయ మాస్క్ తో ముఖంపై ముడతలు తగ్గుతాయి. 

రోజ్ వాటర్

రోజ్ వాటర్ వల్ల ముఖం కాంతి కోసం వస్తుంది. చర్మంపై ఉండే దుమ్ము ధూళిని తొలగించడం సహా చర్మం మృదువుగా మెరిసేలా సహాయపడుతుంది. దూదితో రోజ్ వాటర్ ను రాత్రి పడుకునే ముందు ముఖంపై రాసుకోవాలి. ఆ తర్వాత ఉదయాన్నే ముఖాన్ని కడిగేయాలి. అలా చేయడం వల్ల చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.  

బంగాళదుంప రసం - గ్రీన్ టీ

ఒక గిన్నెలో గ్రీన్ టీ, బంగాళాదుంప రసాన్ని మిక్స్ చేసి.. ఆ మిశ్రమాన్ని దూదితో ముఖంపై అప్లే చేయాలి. అలా రాత్రంతా ఉంచిన తర్వాత ఉదయాన్నే కడిగేయాలి. అలా చేయడం వల్ల ముఖంలో కాంతి వస్తుంది. 

నిమ్మకాయ - క్రీమ్ ఫేస్ మాస్క్

నిమ్మరసంలో బ్లీచింగ్ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని టోన్ చేయడం సహా ముఖంపై ఉన్న నూనె గుణాలను నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. అంతే కాకుండా క్రీమ్ లోని కొవ్వు అమ్లాలు, మీ చర్మాన్ని హైడ్రేట్ చేసేందుకు సహాయపడతాయి. ఒక గిన్నెలో టేబుల్ స్పూన్ క్రీమ్ తీసుకుని అందులో నిమ్మరసం వేసి బాగా కలపాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లే చేసుకొని, ఉదయాన్నే కడిగేయాలి. ఉదయాన్నే కడిగిన తర్వాత ముఖం ఫ్రెష్ గా ఉండడం మీరు గమనిస్తారు. 

పాలు, పసుపు

సూర్యకాంతి వల్ల కొన్నిసార్లు ముఖం రంగు మారుతుంటుంది. అలాంటి పరిస్థితుల్లో పసుపులో ఉండే యాంటీసెప్టిక్ ముఖాన్ని కాంతివంతంగా మారుతుంది. అలా రెండు టేబుల్ స్పూన్ల పసుపు, కొద్దిగా పాలను కలిపి మిశ్రమంగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిసేపటికి చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అలా శుభ్రం చేసుకున్న తర్వాత ముఖం కాంతివంతంగా మారుతుంది. 

(నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. వీటిని పాటించే ముందు వైద్యుడ్ని సంప్రదించడం ఉత్తమం. దీన్ని ZEE తెలుగు News ధ్రువీకరించడం లేదు.)  

Also Read: Internet Speed Tips: Wifi స్పీడ్ తగ్గిందా..? అన్లిమిటెడ్ & హై స్పీడ్ ఇంటర్నెట్ కోసం ఇలా చేయండి!

Also Read: Cockroach Remedies: ఈ చిట్కాలు పాటిస్తే బొద్దింకలు మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రావు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News