Dasara Special Mutton Curry: దసరా పండగ రోజు మటన్ కర్రీ ఇలా చేస్తే.. గల్లీ మొత్తం మీ ఇంటిగుమ్మం వైపు చూడాల్సిందే
Dasara Special Mutton Curry: దసరా అంటేనే సుక్కా..ముక్కా. ఈ రెండూ లేకుంటే పండగ అనే మజానే ఉండదు. దసరా పండగరోజూ తెలంగాణ పల్లెల్లో ఎక్కడ చూసినా మేక తలలు తెగాల్సిందే. ప్రతీ ఇంట్లో..ప్రతీ గల్లీలో..ప్రతి వాడలో మటన్ ఘుమఘుమలు ఆహా నోరూరిస్తాయి. అయితే ఈసారి దసరా పండగక్కి..రెగ్యులర్ వలే కాకుండా...ఇలా డిఫరెంట్ గా చేయండి. ఎలా చేయాలో చూద్దాం.
Dasara Special Mutton Curry: దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దసరా వచ్చిందంటే ప్రతి ఇంట్లోనూ సందడి వాతావరణం నెలకుంటుంది. ముఖ్యంగా తెలంగాణ పల్లెల్లో అయితే దసరా రోజు చుక్కా ముక్కా లేనిది జరుపుకోరు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరూ దసరా సంబురారల్లో మునిగితేలుతారు. కొత్త బట్టలు, పిండివంటలతోపాటు నాన్ వేజ్ తప్పనిసరిగా ఉంటుంది. ప్రతి ఇంట్లోనూ మాంసాహారం వెరైటీలు ఘుమఘమలాడుతుంటాయి. అందులో మటన్ కర్రీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే ఈసపారి దసరా పండగకు మటన్ కర్రీ ఇలా చేశారంటే రుచి అద్భుతంగా ఉంటుంది.
ఇప్పుడు మటన్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం.
మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు :
- మటన్ -1 కేజీ
-నూనె- సరిపడేంత
-ఉల్లిపాయ- పెద్దది ఒకటి
-కారం -రెండు చెంచాలు ( ఘాటు కావాలనుకునేవారు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు )
-పసుపు -పావు చెంచా
-పెరుగు - 1కప్పు
-అల్లం వెల్లుల్లి పేస్టు - 2 చెంచాలు ( అప్పటికప్పుడు ఈ పేస్టు చేసుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది)
-ధనియాల పొడి - చెంచా
-గరంమసాల - చెంచా
-ఉప్పు -రుచికి సరిపడా
- కొబ్బరి పొడి - నాలుగు చెంచాలు
-గసగసాలు - రెండు చెంచాలు ( మటన్ కర్రీలో గసగసాలు వేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది)
- నీళ్లు -2 కప్పులు
- కొత్తిమీర - సరిపడా
తయారీ విధానం :
మటన్ కర్రీ తయారు చేసే ముందు కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉంచుకోండి. ముందుగా గసగసాలు, కొబ్బరిపొడిని దోరగా వేయించుకుని మిక్సీలో ముద్దగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ లో నూనే పోసి వేడి చేయాలి. అందులో తరిగి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి బంగారు వర్ణంలోకి వచ్చేంత వరకు వాటిని దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత పైన పేర్కొన్న విధంగా ఆ మిశ్రమంలో పసుపు, అల్లంవెల్లుల్లిపేస్ కలిపి అవి పచ్చివాసన పోయేంత వరకు దోరగా వేయించుకోవాలి.
ఇప్పుడు శుభ్రంగా కడిగిన మటన్ ముక్కలు అందులో వేయాలి. ఆ తర్వాత కారం, ధనియాలపొడి, ఉప్పు వేయాలి. సన్న మంటమీద వేగనివ్వాలి. అలా పది నిమిషాలు వేగిన తర్వాత ముందుగా సిద్ధం చేసి పక్కన పెట్టుకున్న గసగసాలు, కొబ్బరి పేస్టును పెరుగు, గరం మసాలా ఇవన్నీ మటన్ లో వేసి బాగా కలుపుకోవాలి. మూడు నాలుగు నిమిషాల పాటు ఉంచిన తర్వాత అందులో తగినంత నీళ్లు పోసి మూతపెట్టాలి. మటన్ మెత్తబడే వరకు ఆ మిశ్రమాన్ని ఉడించుకోవాలి. మటన్ ఉడికి కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత మూత తీయాలి. ఆవిరి ఉన్నప్పుడే మూత తీస్తే రుచిగా ఉండదు. ఇప్పుడు అందులో కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటే అదిరిపోయే రుచితో మటన్ కర్రీ రెడీ. దీన్ని గోధుమ లేదా మొక్క జొన్న రొట్టేతో తింటే వాహ్ అనాల్సిందే. బగారా అన్నంలో అయితే రుచి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ దసరా పండగకు ఇలా మటన్ కర్రీ రెడీ చేసుకోండి.
Also Read: Tata Car Discount: దసరా ఆఫర్.. టాటా నుంచి కళ్లు చెదిరే డిస్కౌంట్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.