డియర్ జిందగీ : డబ్బుతో మానసిక ఆనందాన్ని పొందలేం
దయాశంకర్ మిశ్రా, డిజిటల్ ఎడిటర్, జీ న్యూస్ హిందీ
డియర్ జిందగీ.. ఈ మాట ఎప్పటి నుంచో వింటున్న పాత మాట అనుకుంటే పొరపాటే..దైనందిన జీవితంలో మనకు పనికొచ్చే సరికొత్త ఆంశాలను పరిచయం చేసి జీవితంలో నిరాశ, నిస్పృహలను పారద్రోలి ఆనందమయ జీవితాన్ని అందించడమే దీని లక్ష్యం. డియర్ జిందగీ వాస్తవ ప్రపంచానికి దూరంగా వెళ్తుందని చాలా మంది భావిస్తూ ఉండొచ్చు. అయితే వాస్తవానికి ఇది మీకు అత్యంత చేరువలో ఉన్న అంశమనే విషయాన్ని మరిచిపోవద్దు సుమా
ఇక అసలు విషయంలోకి వెళ్దాం.. ఆత్మహత్య ఈ మాట వినగానే మనకు గుర్తుకొచ్చేది..వనరులు లేమీ కారణం. ఆర్ధిక వనరులు లేకపోవడమే అందుకు కారణమని భావిస్తున్నాం. మన చుట్టూ ఉన్న పరిసరాలు చూసి మనం ఇలాంటి అభిప్రాయానికి వస్తున్నాం.. అప్పుల్లో కూరుపోయిన రైతులను చూస్తున్నాం.. ఉద్యోగం కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఉద్యోగిని చూస్తున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల వ్యక్తులు కనిపిస్తుంటారు. ఇలా వివిధ రకాల వ్యక్తులు ఆర్ధిక ఒత్తడికి లోనై ప్రాణాలు బలి తీసుకుంటున్నారు.. అయితే ఇక్కడ వనరుల కొరత వల్లే మాత్రమే ప్రాణాలను బలితీసుకుంటున్నారనుకుంటే పొరపాటే అవుతుంది.
ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే ఎందుకంటే ప్రాణాలు తీసుకోవడానికి ఆర్ధిక అంశమే కారణమనుకంటే పొరపడినట్లే. వాస్తవానికి చాలా సంపన్న వర్గాల్లో కూడా ఇలాంటి ధోరణి కనిపిస్తోంది. అలాంటి వారు ఆత్మహత్యలకు ఎందుకు పాల్పడుతున్నట్లు. అతని దగ్గర ఇల్లు, డబ్బు, హోదా అన్ని ఉంటాయి. అయినప్పటికీ ఏదో కారణం చేత ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. అమెరికా లాంటి సందప్న దేశాల్లో ఆత్మహత్యల రేటు అధికంగా ఉండటమే ఇందుకు నిదర్శనం
ఆత్మహత్యలపై అమెరికా ప్రభుత్వం 2016 లో ఒక నివేదిక రూపొందించింది. ఈ నివేదిక ప్రకారం ఆ ఏడాదిలో 45 వేల మంది పౌరులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఖ్య 1999 తో పోలిస్తే 24 శాతం పెరిగాయి. సంపన్న దేశం అమెరికాలో ఇలా ఆత్మహత్యలు పెరడం ఆశ్చర్యం కాకపోతే మరేమౌతుంది.
కాబట్టి ఆత్మహత్యకు పాల్పడానికి కారణం వనరులు కొరతే అనుకుంటే పొరపాటే. అదే నిజమైతే సంపన్న వర్గాల వారు ఆత్మహత్యలకు పాల్పడానికి ఆస్కారం లేదు. వాస్తవాన్ని మనం గమనించినట్లయితే మనం చుట్టూ ఉన్న సంతోషాన్ని పక్కన పెట్టి లేని దాని కోసం ప్రాకులాడుతుంటాం.. సమస్యను ఎదుర్కొందామన్న ధోరణితో కాకుండా నిరాశ నిస్పృహతో జీవితాన్ని గడుతుండటం... జీవితంలో వత్తిడి వస్తే దాన్ని అధిగమించడానికి ప్రయత్నించకపోడం. మనకు ఈ పరిస్థితికి దారి తీస్తోంది.
ఏదో కారణం చేత అప్పుల బారిన పడితే దీన్ని ఎలా అధిగమించాలని ఆలోచన చేయం..ఆలా చేస్తే వీటి నుంచి బయటపడటం సులభమౌతుంది.. కానీ మనం అలా చేయలేకపోతున్నాం కదూ.. అలాగే సిలబస్ కష్టం గాఉందని విద్యార్ధి ఆత్మహత్య చేసుకుంటాడు.. అలా చేసే బదులు దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలనే ప్రయత్నం చేయడు..కానీ అలా చేయలేకపోతున్నాం.
ఆత్మహత్యలకు కారణం మన దృక్పథ లోపం తప్పా మరోకటి కాదు. జీవితంలో డబ్బు ఒక్కటే ప్రాధాన్యం కాదు.. ప్రేమ మరియు స్నేహానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. అప్పుడే జీవితమనే నావ సక్రమంగా పయనిస్తుంది. విజయవంతగా ముందుకు వెళ్తుంది..
ఒత్తిడి రహిత ఆనందమయ జీవితం కోసం మనం చేయాల్సిందల్లా మన కుటుంబ కోసం సమయం కేటాయించాలి.. జీవిత భాగస్వామి మరియు పిల్లలతో ఎక్కువగా గడపాలి. అప్పడే మనం ఒంటరితనం అనే రాక్షసి నుంచి బయటపడగలం జీవితాన్ని జయించగలం...
తాజా కథనంపై మీ విలువైన సూచనలు, సలహాలు ఇవ్వగలరు:
https://www.facebook.com/dayashankar.mishra.54, https://twitter.com/dayashankarmi
ఈ ఆర్టికల్ ను హిందీలో చదివేందుకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి