Dhana Trayodasi: క్షీరసాగర మదన సమయంలో అమృత కలశాన్ని చేత పట్టుకొని అవతరించిన మహా విష్ణు అవతారంగా ధన్వంతరిని భావిస్తారు. బ్రహ్మవైవర్త పురాణం లో ధన్వంతరి సూర్యభగవానుడి దగ్గర ఆయుర్వేద విద్య నేర్చుకున్నాడని పేర్కొనడం జరిగింది. సూర్యుడికి ఉన్నటువంటి 16 మంది శిష్యులలో ధన్వంతరిని ఒకరిగా చెబుతారు. ఆయన జన్మించిన అశ్వయుజ బహుళ త్రయోదశి.. ధన్వంతరి త్రయోదశి లేక ధన త్రయోదశి గా జరుపుకుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణంగా ఈరోజు మహిళలు వెండి, బంగారం లాంటి వస్తువులను కొనడం వల్ల ఇంటికి లక్ష్మీ ప్రాప్తి ఉంటుందని భావిస్తారు. అయితే చాలామందికి తెలియని ఒక ఆచారం ఈరోజు జరపడం వల్ల అపమృత్య బాధలు తొలగిపోతాయి. ఇలా ధన త్రయోదశి నాడు ఇంటి గుమ్మంలో  సాయంత్రం సమయంలో వెలిగించే దీపాన్ని యమదీపం అంటారు. ఈ ఆచారం వెనుక ఒక ఆసక్తికరమైనటువంటి పురాణ కథ ఉంది. పెళ్లి జరిగిన కొన్ని రోజులకి భర్త చనిపోతాడు అని తెలిసి కూడా ఓ రాకుమారి అతన్ని పెళ్లి చేసుకోవడమే కాకుండా యముడిని మెప్పించి భర్తను బతికించుకుంది.


పూర్వం హీమా అనే ఒక రాజుకి చాలా కాలం తర్వాత లేక లేక కొడుకు పుడతాడు. అయితే అతని జాతకం ప్రకారం వివాహం జరిగిన నాలుగవ రోజే చనిపోతాడు అని  పండితులు చెబుతారు. ఆ మాటకు ఆందోళన చెందిన రాజు అసలు కుమారుడికి పెళ్లి చేయకూడదని నిశ్చయించుకుంటాడు. అయితే పెరిగి పెద్ద అయిన తర్వాత.. అతడిని ఒక రాకుమార్త ప్రేమిస్తుంది. వివాహం జరిగితే వైధవ్యం తప్పదు అని చెప్పినా.. విధిని ఎవరు తప్పించలేదు జరగాల్సింది జరుగుతుంది అని తన ప్రేమ మీద నమ్మకంతో అతని పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి జరిగిన తర్వాత నాల్గవ రోజుకి ఆశ్రయుజ బహుళ త్రయోదశి వచ్చింది.


రాకుమారుడిని ఏ క్షణానైనా మృత్యువు కబలిస్తుంది అని గ్రహించిన రాకుమార్త అతని గది ముందు బంగారు,వెండి నగలు ఇతర ఆభరణాలు రాశులుగా పోస్తుంది. రాజప్రసాదమంతా దీపాలు వెలిగించి.. సంపదతో పాటు సౌభాగ్యాన్ని కూడా ప్రసాదించే మహాలక్ష్మి దేవిని స్తుతిస్తుంది. రాకుమారుడి ప్రాణాలు తీయడానికి పాము రూపంలో వచ్చిన యముడికి చుట్టూ దీపకాంతి ,బంగారు నగల జిగేలు మధ్య కళ్లు చెదిరాయి.


లక్ష్మిదేవి ని స్తుతిస్తూ రాకుమారి పాడే పాటలకు మైమరచిపోయిన యమమహారజు మృత్యు ఘడియలు దాటిపోవడం గమనించుకోలేదు. దీంతో సమవర్తి రాకుమారుడి ప్రాణాలు తీసుకోకుండానే తిరిగి వెళ్ళిపోయాడు.అలా రాకుమారుడు మృత్యుపీడ తొలగిపోయింది.అప్పటి నుంచీ ధన త్రయోదశి నాడు బంగారం, వెండి ఆభరణాలను కొనడం..పూజించడం…ఇంటి బయట దీపాలు వెలిగించడం ఆచారంగా మారింది. ఇలా ధన త్రయోదశి నాడు ఇంటి వాకిట్లో దీపం పెట్టడం వల్ల మృత్యుభయం తొలగిపోతుందని అంటారు. ఇంటి  ఈశాన్య దిశలో  ధన్వంతరి విగ్రహం పెట్టి పూజించడం వల్ల దీర్ఘాయువు లభిస్తుందని నమ్ముతారు.


Also Read: ఆ టైంలో జరుగుంటే నా పరిస్థితి ఏమిటి.. డీప్ ఫేక్ వీడియో పైన స్పందించిన రష్మిక…


Also Read: Redmi 13C Price: అదిరిపోయే ఫీచర్స్‌తో డెడ్‌ చీప్‌ ధరతో మార్కెట్‌లోకి Redmi 13C మొబైల్‌..స్పెసిఫికేషన్స్‌ ఇవే..  



 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook