Sugarcane Juice in Diabetes: చాలా మంది చెరుకు రసం తాగడానికి ఇష్టపడతారు. చెరకు రసాన్ని వేసవిలో హీట్ స్ట్రోక్ నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి వినియోగిస్తారు. అంతేకాకుండా దీనిని బాడీ రిఫ్రెష్ కోసం కూడా ఉపయోగిస్తారు. అయితే ఇందులో శరీరానికి అవసరమైన పోషకాలు, యాంటీఆక్సిడెంట్ల ఉంటాయని ఎవరి తెలియదు..? చెరకు రసంలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషక విలువలు లభిస్తాయి. కాబట్టి ఈ రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం చెరకు రసాన్ని ఓ ఔషధంగా పరిగణిస్తారు. ఇది కాలేయం, కిడ్నీ సంబంధింత వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించేందుకు సహాయపడుతుంది. అయితే మధుమేహంతో బాధపడుతున్నవారు ఈ రసాన్ని తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయని అనుకుంటారు. ఎందుకంటే ఇందులో చక్కెర పరిమాణాలు కూడా ఉంటాయి. ఈ రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే మధుమేహం ఉన్నవారి ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చెరకు రసం ఉండే పోషకాల పరిమాణాలు:
చెరకు నుంచి తీసిన రసాన్ని మద్యం, బెల్లం, బ్రౌన్‌ షుగర్‌ తయారికి వినియోగిస్తారు. చెరకు రసంలో పూర్తిగా చక్కెర పరిమాణాలు ఉండవు. ఇందులో 75 శాతం వరకు నీరు, 15 శాతం ఫైబర్ ఉంటుంది. ప్రాసెస్ చేయని చెరకు రసంలో ఆరోగ్యానికి మేలు చేసే ఫినాలిక్, ఫ్లేవనాయిడ్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి.  చెరకు రసం క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ల మొత్తాన్ని పెంచుతుంది.


మధుమేహ వ్యాధిగ్రస్తులు చెరుకు రసం తాగవచ్చా?:
చెరకు రసం చాలా తీపిగా ఉంటుంది. ఇందులో చక్కెర పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే చాలా మంది అందులో చక్కెర పరిమాణాలు తక్కువగా ఉంటాయని వాటిని తీసుకోవడం మానుకుంటారు. అయితే Healthline.com ప్రకారం అన్ని ఇతర చక్కెర రసాల మాదిరిగానే చెరకు రసం కూడా మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా హానికరం. చెరకు రసం తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరిగే ప్రమాదం ఉంది.


మధుమేహం తీవ్రతరమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మధుమేహంతో బాధపడేవారికి చెరకు రసం తాగమని వైద్య నిపుణులు సలహాలు ఇవ్వరు. ఒక ఈ రసాన్ని క్రమం తప్పకుండా తాగితే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి దీనిని తాగకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


Also Read: Dewald Brevis: బేబీ ఏబీ తుఫాన్ ఇన్నింగ్స్.. 57 బంతుల్లోనే 162 పరుగులు 


Also Read: Minister KTR: సీఎం జగన్ నా బెస్ట్ ఫ్రెండ్.. ఏపీ మూడు రాజధానులపై మంత్రి కేటీఆర్ రియాక్షన్ ఇదే..! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook