Diabetes Control In 5 Days: ప్రస్తుతం చాలా మంది టీ తాగని వారు కూడా తాగడాని అసక్తి చూపుతున్నారు. అయితే చాలా మంది టీని రకరకాలుగా చేసుకుని తాగుతారు. అయితే ఇదే క్రమంలో షుగర్‌ అధిక పరిమాణంలో వేసుకుని తాగుతున్నారు. ఇలా చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ సమస్యలు, రక్తంలో చక్కెర పరిమాణం పెరగడం వంటి సమస్యల బారిన పడుతున్నారు. ఇలాంటి సమస్యల నుంచి బయట పడేందుకు పలు రకాల గ్రీన్‌టీలను తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది షుగర్‌ వ్యాధితో బాధపడుతున్న వారికి కూడా ప్రభావవంగా పని చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గ్రీన్‌లలో అధిక పరిమాణంలో పోషకాలు ఉండడం వల్ల శరీరానికి సంబంధించి అన్ని రకాల సమస్యలను దూరం చేస్తుంది.  ఈ  హెర్బల్ టీ శరీరంలో చక్కెరను నియంత్రించడమే కాకుండా బరువును కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఏ టీలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ టీని తాగడం వల్ల షుగర్‌ సమస్యలు దూరమవుతాయి:


గ్రీన్ టీ:


ప్రస్తుతం చాలా మంది గ్రీన్‌ టీని తాగేందుకు అసక్తి చూపుతున్నారు. బరువు తగ్గడానికి.. జీర్ణక్రియను పెంచడానికి ఈ టీలు చాలా ఉపయోగపడతాయి. అయితే ఈ టీలో ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. కావున శరీరాన్ని వివిధ రకాల వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ముఖ్యంగా శరీరంలో పెరుగుతున్న ఇన్సులిన్ స్థాయిని తగ్గించడానికి ప్రభావవంతంగా సహాయపడుతుంది. మధుమేహంతో బాధపడుతున్న వారికి ఓ ఔషధలా పని చేస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.


మందారం టీ:


మందారం టీలో సీజనల్ వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది. ఈ టీ కోసం మందారం పువ్వులను వినియోగిస్తారు. అయితే మందరంలో ఉండే గుణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అంతేకాకుండా ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. కావున అలసట, ఒత్తిడి దూరం చేస్తుంది.


చమోమిలే పువ్వుల టీ:


ఈ టీ శరీరంలోని ఇన్సులిన్ స్థాయిని నియంత్రించడానికి సహాయపడుతుంది. ఈ హెర్బల్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Gold Price Today: రెండు రోజుల్లోనే భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో ధరల వివరాలివే


Also Read: Shravana Shanivaram: ఇవాళ శ్రావణ మొదటి శనివారం.. ఉద్యోగ, ధన, వివాహ, సంతాన ప్రాప్తి కోసం 4 ముఖ్య పరిహారాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook