Diabetes Symptoms: డయాబెటిస్ బారిన ఒక్కసారి పడితే అది మిమ్మల్ని జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. అయితే ఈ సమస్య కొన్ని ఏళ్ల ముందు వృద్ధాప్య దశలో ఉన్నవారికి వచ్చేది. కానీ ఆధునిక జీవన శైలి కారణంగా 25 సంవత్సరాలు దాటిన వారు కూడా ప్రస్తుతం ఈ వ్యాధితో బాధపడుతున్నారు. అయితే ఈ వ్యాధిని శరీరంలో ఎంత సులభంగా నియంత్రిస్తే అంత మంచిది.. లేకపోతే ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉన్నాయి. కొందరిలోనైతే తీవ్ర అనారోగ్య సమస్యలైనా గుండెపోటు రక్తపోటు వంటి సమస్యలు కూడా వస్తున్నాయని ఇటీవలే ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. డయాబెటిస్ బారిన పడిన వారిలో మెదడు సమస్యలు కూడా వస్తున్నాయని ఇటీవల పలు నివేదికలు తెలిపాయి. రక్తంలోని చక్కెర పరిమాణాల్లో మార్పులు రావడం వల్ల దాని ప్రభావం మెదడుపై పడుతుందని దీంతో తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఇటీవలే పలు నివేదికలు తెలిపిన వివరాల ప్రకారం.. మధుమేహం ఉన్న వారిలో తరచుగా మెదడు సమస్యలు రావడమే కాకుండా జ్ఞాపకశక్తి కూడా మందగిస్తుందని పేర్కొంది. పదేపదే మతిమరుపు సమస్యలు వస్తే తప్పకుండా వైద్యులను సంప్రదించి డయాబెటిస్ టెస్టులను చేయించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
 
మధుమేహం కారణంగా ఈ క్రింది వ్యాధులు కూడా వస్తున్నాయి!:


మతిమరుపు: 
రక్తంలోని గ్లూకోజ్ పరిమాణాల్లో మార్పులు సంభవించి దాని ప్రభావం మెదడుపై తీవ్రంగా పడుతోంది దీని కారణంగా టైప్ టు డయాబెటిస్ ఉన్న వారిలో మతిమరుపు వంటి సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు తప్పకుండా మంచి వైద్యుని సంప్రదించాల్సి ఉంటుంది. 


కంటి హైపర్‌టెన్షన్: 
మధుమేహం కారణంగా చాలామందిలో కంటి సమస్యలు కూడా వస్తున్నాయి. కంటి చూపు తీవ్రంగా మందగించి కొందరైతే కంటి చూపును కూడా కోల్పోతున్నారు. ఇలాంటి సమస్య తరచుగా ఎదుర్కొంటే తప్పకుండా రక్తంలో చక్కెర పరిమాణాలపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది..లేకపోతే మీ కళ్ళకే ప్రమాదం.


బ్రెయిన్ ఫాగ్ సమస్య: 
మధుమేహం వల్ల బ్రెయిన్ ఫాగ్ సమస్య కూడా పెరగడం మొదలవుతుంది. బ్రెయిన్ ఫాగ్ అనేది మనస్సును ఏకాగ్రతగా ఉంచుకోలేకపోవడం. అంతేకాకుండా మానసిక పరిస్థితిలో ఇబ్బందులు తలెత్తడం. ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటే తప్పకుండా నిపుణులను సంప్రదించి చికిత్స పొందడం మంచిది.


Also Read:  Veera Simha Reddy Review : వీర సింహా రెడ్డి రివ్యూ.. మెప్పించిన బాలయ్య, నొప్పించిన గోపీచంద్


Also Read: Veera Simha Reddy Twitter Review : వీర సింహా రెడ్డి ట్విట్టర్ స్టోరీ.. బోయపాటి కన్నా అరాచకం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి