Tulasi Tea For Diabetes: తులసి టీ అంటే తులసి ఆకులను ఉపయోగించి తయారు చేసే ఒక రకమైన హెర్బల్ టీ. తులసి, భారతదేశంలో పవిత్రమైన మొక్కగా భావిస్తారు. దీని ఆకులు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ ఆకులను ఉడికించి తయారు చేసిన టీని తులసి టీ అంటారు. ప్రతిరోజు ఉదయం సాధారణ టీ కంటే ఇలా తులసి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. తులసి టీ తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనేది మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తులసి టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:


తుసిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని మెరుగుపెరచడంలో ఎంతో మేలు చేస్తుంది. దీని వల్ల దగ్గు, జలుబు ఇతర అనారోగ్య సమస్యలు బారిన పడకుండా ఉంటాము. అంతేకాకుండా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడేవారు కూడా ప్రతిరోజు తులసి టీ తీసుకోవడం వల్ల బోలెడు ఆరోగ్యలాభాలు ఉంటాయి. గొంతు నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది. తీవ్రమైన ఒత్తిడి సమస్యతో బాధపడేవారు కూడా తులసి టీ తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే 
అడాప్టోజెన్ ఒత్తిడికి తట్టుకునేలా చేస్తుంది.  మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.


గ్యాస్‌, అసిడిటీ, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలతో బాధపడేవారు పరగడుపున ఈ తులసి టీ తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు పొందవచ్చు. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో ఎంతో మేలు చేస్తుంది. అలాగే కాంతివంతమైన చర్మం కోసం కూడా దీని ఉపయోగించవచ్చు. ఇది చర్మ సంబంధిత సమస్యలను తగ్గించడంలో కూడా ఎంతో  సహాయపడతుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఈ టీ తీసుకోవడం మంచిది. ఇది గుండె పోటు, అధిక రక్తపోటు, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బరువు తగ్గాలి అనుకొనేవారు తులసి టీ తీసుకోవడం చాలా మంచిది. ఇది ఎన్నో రకాలుగా శరీరానికి సహాయపడుతుంది. 


తులసి టీ ఎలా తయారు చేసుకోవాలి:


తులసి టీ తయారు చేసుకోవడం చాలా సులభం. ఇందులో ఉండే ఔషధ గుణాలు అనేక ఆరోగ్య సమస్యలకు చక్కటి నివారణ.


కావలసిన పదార్థాలు:


తాజా తులసి ఆకులు
అల్లం ముక్క 
జీలకర్ర
మిరియాలు
బెల్లం లేదా తేనె 
నీరు


తయారీ విధానం:


నీటిని మరిగించు: ఒక పాత్రలో నీటిని పోసి బాగా మరిగించాలి.


పదార్థాలను చేర్చు: మరిగిన నీటిలో తులసి ఆకులు, అల్లం ముక్క, జీలకర్ర, మిరియాలు వేసి కొన్ని నిమిషాలు మరిగించాలి.


వడకట్టండి: ఆ తర్వాత మిశ్రమాన్ని వడకట్టి ఒక కప్పులోకి తీసుకోవాలి. రుచికి తగినంత బెల్లం లేదా తేనె కలుపుకోవచ్చు.


ముఖ్యమైన విషయాలు:


తులసి టీని వేడిగా తాగితే మంచి ఫలితం ఉంటుంది. రోజుకు ఒక కప్పు తులసి టీ తాగితే సరిపోతుంది.
తులసి టీని రాత్రి పూట తాగకూడదు.
గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు తులసి టీ తాగే ముందు వైద్యుని సలహా తీసుకోవాలి.
అలర్జీ ఉన్నవారు తులసి టీ తాగడం మానుకోవాలి.


ముగింపు:


తులసి టీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది ఒక సహజమైన, ఆరోగ్యకరమైన పానీయం. అయితే, ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నట్లయితే, వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.


Also read: Vangi Bath: వాంగీబాత్ ని ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ సూపర్‌గా ఉంటుంది..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter