Porridge Water For Glass Skin: ప్రస్తుత కాలంలో చాలా మంది  చర్మం సంరక్షపై పలు జాగ్రత్తలు పాటిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు అందంగా కనిపించడానికి ఎన్నో రకాల ఫేస్‌ మాస్క్‌లు, ప్రొడెక్ట్స్‌లను ఉపయోగిస్తారు. మరి కొంతమంది బ్యూటీ పార్లర్ లో వేలల్లో ఖర్చు చేస్తుంటారు. అయితే ఈ మధ్యకాలంలో చాలా మంది కొరియన్‌ గ్లాస్‌ స్కిన్‌ పై మొగ్గుచూపుతున్నారు.  ఈ కొరియన్‌ గ్లాస్‌ స్కిన్‌ పై రీల్స్‌, వీడియోలు కనిపిస్తున్నాయి. అయితే ఈ గ్లాస్‌ స్కిన్ కోసం మీరు ఎలాంటి ప్రొడెక్ట్స్‌, మాస్క్‌లపై ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే మీరు సహజంగా ఈ మెరిసే చర్మాని పొందవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొరియన్‌ గ్లాస్‌ స్కిన్‌: 


గంజి నీటిని చర్మానికి టోనర్‌గా ఉపయోగించడం వల్ల చర్మం మృదువుగా, స్పష్టంగా, మెరిసేలా ఉండేలా చేస్తుంది. దీనిని కొరియన్‌ మహిళలు ఫేస్‌ మాస్క్‌ల ఉపయోగిస్తారు. గంజి నీటిలో ఎన్నో లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంపై కలిగే మచ్చలు, మొటిమలు నుంచి రక్షిచయంలో సహాయపడతాయి. 


ఈ గంజి నీటితో చర్మాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా మొటిమలు, మచ్చలు, చర్మంపై కలిగే చికాకు వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే స్కిన్‌ను మృదువుగా, సిల్క్‌ లాంటి అనుభూతిని కలిగిస్తుంది.  గంజి నీళ్ళుతో చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. అలాగే ఈ నీటి వల్ల చర్మం ఎల్లప్పుడు హైడ్రేట్‌గా ఉంటుంది. 


కొరియన్ గ్లాస్‌ స్కిన్‌ తయారీ విధానం: 


కావాల్సిన పదార్థాలు:


* 1 కప్పు బియ్యం
* 3 కప్పుల నీరు


తయారీ విధానం:


ముందుగా బియ్యాన్ని కడిగి ఒక పాత్రలో నీరు పోయాలి.ఇప్పుడు మంట మీద పెట్టి ఆ నీరు మరిగే వరకు ఉడికించాలి. నీరు మరిగిన తర్వాత మంట తగ్గించి ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మంట ఆపి, గంజిని చల్లబరుచుకోవాలి. గంజిని శుభ్రమైన సీసాలో వడగట్టి, ఫ్రిజ్‌లో నిల్వ చేయండి. ఈ విధంగా దీనిని తయారు చేసుకోవచ్చు.


ఉపయోగించే విధానం:


ప్రతిరోజు ఉదయం, సాయంత్రం మీ ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత ఈ  గంజి నీటిని ఒక కాటెన్‌ ప్యాడ్‌లో ముంచి ముఖం శుభ్రం చేసుకోవాలి. గంజి నీటిని ఫేస్ మిస్ట్‌గా కూడా ఉపయోగించవచ్చు. గంజి నీటిని ఫేస్ మాస్క్‌లో ఒక పదార్ధంగా కూడా ఉపయోగించవచ్చు. ఈ విధంగా మీరు అందమైన, కాంతివంతమైన చర్మానికి పొందవచ్చు.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి