Do Not Keep In Fridge: ఫ్రిజ్లో ఈ 5 ఆహారపదార్థాలు ఎప్పుడూ పెట్టకూడదు.. విషంగా మారతాయి జాగ్రత్త..!
Do Not Keep In Fridge: సాధారణంగా మన అందరి ఇళ్లలో ఫ్రిజ్ ఉంటుంది. అందులో కూరగాయలు, పండ్లు, మిగిలిన ఆహారం స్టోర్ చేస్తాం. ఈరోజుల్లో ఇంట్లో ఫ్రిజ్ లేకుంటే ఏ పని కాని పరిస్థితి ఏర్పడింది. అయితే, ఫ్రిజ్ లో అన్ని ఆహారాలను పెట్టకూడదు.
Do Not Keep In Fridge: సాధారణంగా మన అందరి ఇళ్లలో ఫ్రిజ్ ఉంటుంది. అందులో కూరగాయలు, పండ్లు, మిగిలిన ఆహారం స్టోర్ చేస్తాం. ఈరోజుల్లో ఇంట్లో ఫ్రిజ్ లేకుంటే ఏ పని కాని పరిస్థితి ఏర్పడింది. అయితే, ఫ్రిజ్ లో అన్ని ఆహారాలను పెట్టకూడదు. దీనివల్ల మన ఆరోగ్యం పాడవుతుంది. ఫ్రిజ్ లో పెట్టిన అటువంటి ఆహారం తింటే విషంగా మారుతుంది. అవేంటో తెలుసుకుందాం.
అన్నం: ప్రతిరోజూ ఇళ్లలో అన్నం ఉంటుంది. కాస్త ఎక్కువ తక్కువ అవుతుంది. ఒకవేళ మిగిలిన అన్నం లేదా బిర్యానీ ఉంటే దాన్ని ఫ్రిజ్ లో పెట్టుకుంటాం. కానీ, అది తప్పు అన్నం వేడివేడిగా ఉన్నప్పుడే తినాలని వైద్యులు చెబుతారు. అయితే, 24 గంటల తర్వాత ఫ్రిజ్ లో పెట్టిన అన్నం విషంగా మారిపోతుందని అధ్యయనాలు చూపించాయి.
వెల్లుల్లి: చాలామంది వెల్లుల్లి తొక్క తీసి పెట్టుకుంటారు. తొక్క తీయడం కాస్త టైం తో కూడుకున్నది. దానికి ముందుగానే తొక్క తీసిపెట్టుకుంటారు. ఒక వేళ తొక్కతీసిన వెల్లుల్లిని ఫ్రిజ్ లో పెడితే అది ఆహారంలో వాడకూడదు. ముఖ్యంగా తొక్కతీసిన వెల్లుల్లి ఫ్రిజ్లో పెట్టి ఆహారంలో వాడితే అది విషంలా మారుతుంది.
టమాట: టమాటా,బంగాళదుంపలు కూడా ఫ్రిజ్లో పెట్టకూడదు. ఆకుకూరలను కూడా ఫ్రెష్ గా వండుకోవడం మంచిది. ఫ్రిజ్ లో ఈ పదార్థాలు పెట్టుకోవడం వల్ల వాటిలోని పోషకాలు తగ్గిపోవడమే కాకుండా ఒక్కోసారి అవి విషంలా మారే ప్రమాదం ఉంది. దీంతో అనారోగ్యం బారిన పడాల్సి ఉంటుంది.
ఉల్లిపాయ: ఉల్లిపాయలను కూడా ఫ్రిజ్ లో నిల్వ చేసుకోకూడదు. ఉల్లిపాయలను ఫ్రిజ్లో పెట్టడం వల్ల అందులో ఉండే స్టార్చ్ కంటెంట్ సాలిడ్ కంటెంట్ గా మారుతుంది. అలాగే కట్ చేసి మిగిలిపోయిన ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాలయను కూడా ఫ్రిజ్ పెట్టకూడదు. వాటిని ఆహారంలో వాడకూడదు. అందులో బాక్టీరియా పేరుకుపోయే ప్రమాదం ఉంది. అటువంటి ఆహారం తీసుకుంటే ఫుడ్ పాయిజన్ కూడా దారితీయవచ్చు.
అల్లం: అల్లం ఎట్టిపరిస్థితుల్లో ఫ్రిజ్లో పెట్టకూడదు. ఎందుకంటే అల్లం ఫ్రిజ్ లో పెట్టింది వాడితే మీ కిడ్నీ ,కాలేయం పాడయ్యే అవకాశం ఉంది. అల్లంలో ఉండే పోషకాలు మలబద్ధకాన్ని నివారిస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ న్యూట్రీషియన్స్ ఫ్రిజ్‌లో ఉంచితే అవి నాశనమవుతాయి..
ఇదీ చదవండి: Diabetes Care: ఈ 5 రకాల పిండి మధుమేహులకు ఉత్తమం.. ఇవి షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తాయట..
ఇదీ చదవండి: Uric Acid: ఈ పప్పు యూరిక్ యాసిడ్ రోగులకు విషం.. వెంటనే వీటిని తినడం ఆపేయండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter