Dreams in sleeping: కొంతమంది నిద్రలో కలలు కంటుంటారు. మరికొందరికి మాత్రం నిజజీవితంలో జరిగే కొన్ని సంఘటనలు నిద్రించే సమయంలో కలల ద్వారా తెలిసి ఉండొచ్చు. అయితే నిద్రలో కొన్ని విధమైన కలలు రావడం అశుభానికి సూచకమని పెద్దలు అంటున్నారు. అవి తమ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపొచ్చని చెబుతున్నారు. అంతే కాకుండా వ్యక్తి ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి దెబ్బ తినే అవకాశం లేకపోలేదని వారి వాదన. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాంటి కొన్ని విధాలైన కలల హానికరమని తెలిపే కొంత సమాచారాన్ని మేము మీకు అందిస్తున్నాం. అయితే ఈ కలలు సాధారణమైనవి అనిపించినప్పటికీ.. అవి పెద్ద ఆర్థిక నష్టం లేదా అవాంఛనీయ, ప్రమాదకర సంఘటనలకు ముందు సూచికలని నమ్మకం. అలాంటి అశుభాలను తీసుకొచ్చే కలలేవో తెలుసుకుందాం.


అశుభాన్ని పలికే కలలు..


ఎత్తైన ప్రదేశం నుంచి కిందికి పడిపోవడం:


అలాంటి కల మీకు నిద్రలో వస్తే.. మీరు పెద్ద నష్టాన్ని చవిచూడబోతున్నారనే దానికి ముందు సూచిక అని అర్థం. ఉదాహరణకు డబ్బు నష్టం లేదా వృత్తి పరంగా నష్టాలు కలగొచ్చు. అలా ఎత్తైన ప్రదేశాల నుంచి కిందికి పడిపోవడం వంటి కల వచ్చినప్పుడు.. ఇష్టదైవాన్ని ప్రార్థించడం వల్ల మేలు జరుగుతుందని తెలుస్తోంది. 


ఇంటికి తాళం వేసినట్లు కలలో కనిపిస్తే..


కలలో ఏదైనా ఇంటి తలుపునకు తాళం వేసి ఉన్నట్లు మీకు కనిపిస్తే వృత్తి పరంగా మీకు ఏదైనా అశుభం జరగవచ్చనే దానికి అర్థమది. అలాంటి కలలు వచ్చినప్పుడు ఆంజనేయ స్వామిని స్మరించుకుంటే మంచి జరుగుతుంది. వీలైతే ఆంజనేయ స్వామికి ఎర్రని వస్త్రాలు సమర్పిస్తే మేలు కలుగుతుంది.


నల్ల పిల్లి కనిపిస్తే..


కలలో నల్ల పిల్లి కనిపించడం వల్ల ఏదైనా అశుభం జరగవచ్చు అనే దానికి సంకేతమది. అలాంటి కలలు వచ్చినప్పుడు పరమ శివుడ్ని స్మరించుకోవాలి. వీలైతే అభిషేకం, రుద్రాభిషేకం చేయడం వల్ల మేలు జరుగుతుంది. 


పసుపు బట్టలపై మరలు ఉన్నట్లు కలలో కనిపిస్తే..


కలలో పసుపు బట్టలపై మరకలు కనిపిస్తే, అది డబ్బు నష్టానికి సంకేతం. అలాంటి కల వచ్చినప్పుడు లక్ష్మీ దేవికి ఎర్రని దుస్తులు సమర్పించాలి. వీటితో పాటుగా ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు పూజలు చేస్తే మంచి జరుగుతుంది.  


కలలో జంతువులు కనిపిస్తే..


కలలో అనేక జంతువులు కలిసి కనిపిస్తే, అది మీ ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుందని అర్థం. అటువంటి పరిస్థితిలో, పేదలకు బట్టలు దానం చేయడం వల్ల దానికి నివృత్తి కలిగే అవకాశం ఉంది. వీలైతే ఎరుపు రంగు వస్త్రాలను దానం చేయండి.


(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా జోతిష్య శాస్త్రజ్ఞుల సూచన మేరకు రాసినది. దీన్ని ZEE తెలుగు News ధ్రువీకరించడం లేదు.)  


Also Read: Emotional Eating: ఎమోషనల్ ఈటింగ్ అంటే ఏంటి.. ఆ సమస్యను ఎలా అధిగమించాలి


Also Read: Father - Daughter Love: కూతురికి బ్రెయిన్ సర్జరీ.. తండ్రి చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి