Oats Benefits During Winter:  సాధారణంగా ప్రతిరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి చాలా మంది ఓట్స్‌ను తింటారు. ఓట్స్‌ కూడా ఒక రకమైన ధాన్యం. ఇందులో బోలెడు పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఫైబర్‌, ప్రోటీన్‌, విటమిన్‌లు అధికంగా ఉంటాయి. ఆరోగ్యనిపుణుల ప్రకారం ఓట్స్‌ను తినడం వల్ల బరువు తగ్గుతారని చెబుతున్నారు. అయితే చలికాలంలో ఓట్స్‌ తినడం వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి..? ఓట్స్‌ వల్ల కలిగే లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓట్స్‌లో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో కీలక ప్రాత పోషిస్తుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యంగా ఉంచడంలో చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో కీలక ప్రాత పోషిస్తుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు ప్రోటీన్‌ కంటెంట్‌ అధికంగా ఉండటం వల్ల శరీరాని దృఢంగా ఉంచుతుంది.  ఓట్స్‌లో విటమిన్ బి కాంప్లెక్స్, మాంగనీస్, ఫాస్ఫరస్ , మెగ్నీషియం వంటి ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. 


చలికాలంలో ఓట్స్‌ను ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.  దీని వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. మలబద్ధకం, గ్యాస్‌, అజీర్ణం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. చలికాలంలో చాలా మంది కారం, నూనె పదార్ధాలు తింటారు. దీని వల్ల బరువు పెరుగుతారు. వీటికి బదులుగా ఓట్స్‌ను తినడం వల్ల. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తాయి. ఈ కాలంలో రోగల బారిన పడుతుంటారు. కాబట్టి ఓట్స్‌లో ఉండే విటమిన్లు, ఖనిజాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.


ఓట్స్‌తో చేసే రకరకాల రెసిపీలు:


ఓట్స్ పొద్దుటి భోజనం: ఓట్స్‌ను పాలతో లేదా నీటితో ఉడికించి, పండ్లు, గింజలు, విత్తనాలు వంటి వాటిని కలిపి తినవచ్చు.


ఓట్స్ ఉప్మా: ఓట్స్‌ను ఉల్లిపాయలు, క్యారెట్లు, బీన్స్ వంటి వాటితో ఉప్మా చేసి తినవచ్చు.


ఓట్స్ చిట్టి చేమ: ఓట్స్‌ను పాలతో ఉడికించి, బెల్లం, నెయ్యి వంటి వాటిని కలిపి చిట్టి చేమలా చేసి తినవచ్చు.


ఓట్స్ కేక్: ఓట్స్‌తో కేక్, బిస్కెట్లు వంటి వాటిని తయారు చేయవచ్చు.


ఓట్స్ స్మూతీ: ఓట్స్‌ను పండ్లు, పాలతో కలిపి స్మూతీ చేసి తాగవచ్చు.


ముఖ్యమైన విషయాలు:


ఓట్స్‌ను కొనుగోలు చేసేటప్పుడు సేంద్రీయ ఓట్స్‌ను ఎంచుకోవడం మంచిది.  రోజూ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు వ్యక్తి నుంచి వ్యక్తికి మారవచ్చు. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వైద్యుని సలహా తీసుకోవడం మంచిది. ఓట్స్‌ను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.


గమనిక: ఈ సమాచారం కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.


Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి