High Bp: హై బీపీ సమస్యతో బాధపడుతున్నారా? ఈ చిట్కాలను ట్రైచేసి చూడండి..
Tips To Control High Bp: ప్రస్తుత కాలంలో తీవ్రమైన ఒత్తిడి కారణంగా చాలా మంది బీపీ సమస్యతో బాధపడుతున్నారు. అయితే హై బీపీ సమస్యతో బాధపడేవారి సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. హై బీపీ అధికంగా ఉంటే గుండె సమస్యల బారిన పడాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ హై బీపీని ఎలా అధిగమించాలి అనే విషయాపై మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Tips To Control High Bp: బీపీ కంట్రోల్ చేయడానికి చాలా మంది వివిధ రకాల చికిత్సలు, మందులు వాడుతుంటారు. దీని వల్ల ఉపశమనం పొందలేకపోతున్నారు. అయితే ఎలాంటి మందుల సహాయం లేకుండానే ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో బీపీని కంట్రోల్ చేసుకోవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఎలాంటి పదార్థాలు తీసుకోవడం వల్ల బీపీని కంట్రోల్‌లో ఉంచవచ్చ అనే దానిపై మనం ఇప్పుడు తెలుసుకుందాం..
✑ బీపీ కంట్రోల్ చేయడంలో నిమ్మరసం ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీని కోసం ప్రతి రోజు వేడి నీళ్లలో అర చెక్క నిమ్మరసం వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పరిగడుపునే తీసుకోవాలి.
✑ ఒత్తిడి సమస్య కారణంగా కూడా బీపీ లెవల్స్ పెరుగాయి. దీని కోసం పుచ్చకాయ గింజలను పొడిగా చేసుకోవాలి. ఇందులో కొన్ని గసగసాలను కలుపుకొని ఉదయం, రాత్రి తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది.
Also read: Oily and Greasy Hair: ఏం చేసిన జుట్టు మురికిగానే ఉంటోందా? శీతాకాలంలో ఇలా చేయండి!
✑ చాలా వెల్లుల్లి ముక్కలను తినకుండా ఉంటారు. కానీ ఈ వెల్లుల్లి తీసుకోవడం వల్ల బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బలను తీసుకొని పొడిగా దంచుకొని తేనె కలుపుకోవాలి. దీని తినడం వల్ల బీపీ తగ్గుతుంది.
బీపీ మాత్రలు వేసుకొనేవారు మాత్రం వైద్యుల సహాలతో ఈ చిట్కాలను పాటించడం చాలా అవసరం. ఈ చిట్కాలను పాటించండి వల్ల కొంత ఉపశమనం పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Also read: Home Remedies For Cracked Heels: ఎలాంటి ఖర్చు లేకుండా మడమల్లో పగుళ్ల నుంచి 6 రోజుల్లో ఉపశమనం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter