Egg White For Hair: ప్రస్తుతం చాలామంది తీవ్ర జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. కొందరు జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడితే, మరికొందరు తెల్ల జుట్టు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తరచుగా రసాయనాలతో కూడిన కొన్ని ప్రోడక్ట్‌లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. అంతేకాకుండా ఖరీదైన చికిత్సలను చేయించుకుంటున్నారు. వీటన్నిటిని వినియోగించకుండా, రూపాయి ఖర్చు లేకుండా సులభంగా ఈ జుట్టు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని కొందరు ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. జుట్టు సమస్యలన్నిటికీ గుడ్డులోని తెల్లసొనతో పరిష్కారమవుతాయని వారంటున్నారు. అయితే జుట్టు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఎగ్ వైట్‌ని ఎలా వినియోగించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలా మిక్స్ చేసి జుట్టుకు ఎగ్ వైట్ ను పాటించాలి:
గుడ్డు, ఉసిరి పొడి:

జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారు గుడ్డు ఉసిరి పొడిని కలిపి జుట్టుకు పట్టించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి ముందుగా రెండు కోడిగుడ్ల నుంచి ఎగ్ వైట్‌ను వేరు చేయాల్సి ఉంటుంది. ఇలా వేరు చేసిన ఎగ్ వైట్‌లో ఒక చెంచా ఉసిరి పొడిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల వరకు అప్లై చేసి 20 నిమిషాల పాటు వదిలేసి నీటితో శుభ్రం చేసుకుంటే తొందర్లోనే మంచి ఫలితాలు పొందుతారు.


ఎగ్ వైట్, తేనె:
ఎగ్ వైట్ తేనె రెండు మిక్స్ చేసి జుట్టుకు వినియోగించడం వల్ల కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే పోషకాలు జుట్టును దృఢంగా తయారు చేస్తాయి. అయితే ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి ముందుగా రెండు కోడిగుడ్ల నుంచి ఎగ్ వైట్‌ని వేరుచేసి అందులో రెండు చెంచాల తేనె కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసిన తర్వాత జుట్టుకు పట్టించి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఇలా ఆరిన తర్వాత సాధారణ షాంపుతో జుట్టును శుభ్రం చేసుకుంటే జుట్టు ఆరోగ్యం మెరుగు పడుతుంది.


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం


గుడ్డు, విటమిన్ ఇ, కొబ్బరి నూనె:
ఈ మూడు జుట్టుకు పోషకాల అందించేందుకు ఎంతగానో సహాయపడతాయి. గుడ్డు, విటమిన్ ఇ, కొబ్బరి నూనె మిక్స్ చేసి జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. అంతేకాకుండా జుట్టు చివర్ల చిట్లిపోకుండా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తరచుగా జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ రెమెడీని ట్రై చేయండి. 


గుడ్డు, ఆలివ్ నూనె:
ఎగ్ వైట్ ఆలివ్ ఆయిల్ ను మిక్స్ చేసి జుట్టుకు పట్టించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ నూనెలో ఉండే గుణాలు జుట్టు రంగును పెంచడమే కాకుండా రాలడాన్ని కూడా సులభంగా తగ్గిస్తాయి. కాబట్టి గుడ్డు ఆలివ్ ఆయిల్ కలిపిన మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter