What is Emotional Eating: ఎమోషనల్ ఈటింగ్ అంటే ఏంటో మీకు తెలుసా... నెగటివ్ ఎమోషన్స్ చుట్టుముట్టినప్పుడు లేదా భావోద్వేగపూరితమైన వెలితి ఏదో వెంటాడినప్పుడు.. కొంతమంది మనసు అకస్మాత్తుగా ఫుడ్ మీదకు మళ్లుతుంది. తమకు బాగా ఇష్టమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా.. తమను వెంటాడుతున్న వెలితి నుంచి బయటపడి.. ఒకరకమైన తాత్కాలిక సంతృప్తిని, నిండుదనం లాంటి ఫీలింగ్‌ను పొందుతారు. దాన్నే 'ఎమోషనల్ ఈటింగ్' అని అంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎమోషనల్ హంగర్‌కి, ఫిజికల్ హంగర్‌కి తేడా ఇదే..


  • ఎమోషనల్ హంగర్ అనేది అకస్మాత్తుగా కలిగే ఫీల్. అప్పటికప్పుడు కలుగుతుంది. ఫిజికల్ హంగర్ అనేది సహజంగా కలిగే ఆకలి. ఇది క్రమంగా తెలుస్తుంటుంది. 

  • ఫిజికల్ హంగర్‌తో ఉన్నవారు ఏ ఫుడ్ తీసుకున్నా ఆకలి తీరుతుంది. 

  • ఎమోషనల్ హంగర్‌‌తో ఉన్నవారు తమకు ఇష్టమైన ఆహారాన్ని తీసుకుంటేనే సంతృప్తి పొందుతారు.

  • ఫిజికల్ హంగర్‌తో ఉన్నవారికి.. ఇక కడుపు నిండినట్లు అనిపించగానే తినడం ఆపేస్తారు.

  • ఎమోషనల్ హంగర్‌తో ఉన్నవారు ఆహారం ఎక్కువగా తీసుకుంటారు కానీ.. కడుపు నిండినట్లుగా అనిపించదు.

  • ఫిజికల్ హంగర్‌తో ఉన్నవారికి తమ తిండి పట్ల ఎలాంటి నెగటివ్ ఆలోచనలు ఉండవు.

  • ఎమోషనల్ హంగర్‌తో ఉన్నవారు తమ తిండి పట్ల ఒకింత అపరాధ భావంతో ఉంటారు.


 


ఎమోషనల్ ఈటింగ్‌‌' బారిన పడకుండా ఉండేందుకు చిట్కాలు :


ఆ కారణాలేంటో తెలుసుకోండి : ముందు మీ ఆకలికి కారణాలేంటో అర్థం చేసుకోండి. నిజంగానే మీకు ఆకలి కలుగుతోందా.. లేక భావోద్వేగపూరితమైన వెలితి ఏదైనా మనసును తిండి వైపు లాగుతోందా...? ఈ విషయాలను అర్థం చేసుకోవాలి.


ఒత్తిడిని తగ్గించుకోండి : ఎమోషనల్ ఈటింగ్‌కి ఒత్తిడి కూడా ఒక కారణం. యోగా, ధ్యానం, ఆర్మోథెరపీ, మ్యూజిక్ థెరపీ వంటి వాటి ద్వారా ఒత్తిడి నుంచి బయటపడే ప్రయత్నం చేయండి.


ఏం తింటున్నారో గమనించండి : పోషక పదార్థాలతో కూడిన సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోండి. ఒకవేళ ఎమోషనల్ ఈటింగ్‌ ఫీల్‌తో తిన్నా.. మంచి డైట్‌ ఉండేలా చూసుకోండి.


అందుకు సంకోచించకండి : ఎమోషనల్ ఈటింగ్‌ను అశ్రద్ధ చేయకండి. ఒకవేళ మీరు ఆ సమస్యతో బాధపడుతున్నట్లయితే ఇతరులతో షేర్ చేసుకోండి. అశ్రద్ధ చేస్తే అది ఇతర ఆరోగ్య సమస్యలకు (Health) దారితీసే అవకాశం లేకపోలేదు. 


Also Read: Darshanam Mogilaiah: పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు సీఎం కేసీఆర్ రూ.1 కోటి నజరానా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook