Benefits Of Morning Sunlight: కేవలం చలికాలంలోనే కాకుండా ప్రతిరోజు ఎండలో నిలబడడం వల్ల ఆరోగ్యనికి ఎంతో మేలు కలుగుతుంది. ఎండ‌లో నిల‌బ‌డ‌డం వ‌ల్ల నిద్ర‌ను ప్రేరేపించే హార్మోన్ అయిన మెల‌టోనిన్ ఉత్ప‌త్తి మెరుగుగా ఉంటుంది. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నవారు ప్రతిరోజు ఎండలో నిలబడడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతేకాకుండా సూర్యకాంతి మన శరీరా చర్మంపై పడటం వల్ల సెరోటోనిన్ గుణాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దీని వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది.  ఎండలో నిలబడడం కారణంగా ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. ఉదయం ఎండలో నిలబడడం వల్ల ఉల్లాసంగా,ఆనందంగా,ఆరోగ్యంగా ఉండవచ్చు. 


Also read: Coconut Rice: కొబ్బరి రైస్ తయారు చేసుకోండి ఇలా!


ముఖ్యంగా ఎండ‌లో నిల‌బ‌డ‌డం వ‌ల్ల  విట‌మిన్ డి ని పొందవచ్చు. విట‌మిన్ డి  వ‌ల్ల  రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. దీంతో ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. విట‌మిన్ డి లోపం రాకుండా ఉంటుంది. రోజూ 20 నిమిషాల పాటు ఎండ‌లో నిల‌బ‌డడం వల్ల శ‌రీరం ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.


Also read: Hair Dandruff: ఈ రసంతో చుండ్రు సమస్యలకు చెక్‌!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter