Eye Care In Diabetes: మధుమేహం ఒక తీవ్రమైన వ్యాధి. దీని కారణంగా శరీరంలో చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా దీని ప్రభావం చాలా రకాల శరీర భాగాలపై ప్రభావం పడే ఛాన్స్‌ ఉంది. రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా పెరిగితే కంటిలో రెటినోలోని పలు రకాల మార్పలు సంభవించి వివిధ రకాల కంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. DED అనే కంటి వ్యాధికి కూడా కారణం అవ్యొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రస్తుతం చాలా మందిలో మధుమేహం కారణంగా కళ్లలో సమస్య వస్తున్నాయి. కాబట్టి ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అయితే మధుమేహంతో బాధపడుతున్నవారు కళ్ల పట్ల ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎందుకు చూపు మందగిస్తుందో తెలుసా..?:
మధుమేహం వచ్చిన తర్వాత చూపు మందగించడం, డబుల్‌ విజన్‌ ​​సమస్య, కళ్లు నొప్పులు, కళ్లు ఎర్రబడడం, సరళరేఖ చూడడంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. ఇవి కళ్లకు హెచ్చరికల సంకేతాలుగా ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా వైద్యులను సంప్రదించడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.


చక్కెరను నియంత్రించండి:
డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు తప్పకుండా చక్కెర పరిమాణాలను నియంత్రించుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే దీని ప్రతి రోజూ ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ప్రతి రోజూ అధిక కేలరీలు, కార్బోహైడ్రేట్, తీపి పదార్థాలు తినడం మానుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తే సులభంగా రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి.


ధూమపానానికి దూరంగా ఉండండి:
మధుమేహంతో బాధపడేవారు కళ్ల సమస్యలు ఉంటే తప్పకుండా ధూమపానాన్ని మానుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా మంది మధుమేహం ఉన్నవారిలో కళ్ల సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు ఇదేనని నిపుణులు చెబుతున్నారు. ధూమపానం వల్ల కళ్లలోని రక్తనాళాలు కూడా చెడి పోయే అవకాశాలున్నాయి.


రక్తపోటును నియంత్రించుకోవడం చాలా మంచిది:
డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు రక్తపోటుపై శ్రద్ధ చూపడం కూడా చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్నవారు తప్పకుండా ఆహారాల్లో ఉప్పును, నూనె తక్కువగా వినియోగించాల్సి ఉంటుంది. దీంతో రక్త పోటు కూడా నియంత్రణలో ఉంటుంది.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read : Ma Bava Manobhavalu : మా బావ మనోభావాలు.. దుమ్ములేపిన బాలయ్య.. దరువేసిన తమన్


Also Read : Top Heroine in 2022 : ఈ ఏడాది బ్యాడ్ లక్ సఖిలు వీళ్లే.. నక్క తోక తొక్కిన హీరోయిన్లు ఎవరంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook