Eye Flu During Monsoon Season: దేశవ్యాప్తంగా ఎడతెరుపు లేని వర్షాలు కురుస్తున్నాయి. దీని కారణంగా వాతావరణంలో తేమ పరిమాణాలు సులభంగా పెరుగుతూ ఉంటాయి. దీని కారణంగా అనారోగ్య సమస్యలు రావడమే కాకుండా  కళ్లకు సంబంధించిన వ్యాధులు కూడా వేగంగా వస్తాయి. ముఖ్యంగా చాలా మందిలో కంటి ఫ్లూ కేసులు విపరీతంగా పెరుగుతాయి. దీని కారణంగా కళ్ల నొప్పులు, ఎరుపు రంగులోకి మారడం వంటి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా కళ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతకీ ఐ ఫ్లూ అంటే ఏమిటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి. ఈ ప్లూ నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐ ఫ్లూ అంటే ఏమిటి?
ఐ ఫ్లూ వైద్య పరిభాషలో పింక్‌ ఐస్‌ అని పిలుస్తారు. ఇది వర్షంలో అతిగా తడవడం వల్ల వస్తాయని వైద్యులు తెలుపుతున్నారు. కంటి ఫ్లూ సమయంలో కళ్ళలోని తెల్లటి భాగంలో ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు కూడా వస్తాయి. దీని కారణంగా తీవ్ర కంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తరచుగా వానా కాలంలో ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. 


ఐ ఫ్లూ లక్షణాలు:
✽ కళ్లు ఎర్రబడడం 
✽ కళ్లలో తెల్లటి శ్లేష్మం కనిపించడం 
✽ కళ్లలో నుంచి అతిగా నీరు కారడం
✽ కళ్లలో వాపు  
✽ కళ్లలో నొప్పి
✽ కళ్లలో దురద


Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?


ఐ ఫ్లూ నుంచి ఇలా ఉపశమనం పొందండి:
❁ ఐ ఫ్లూ సమస్యలతో బాధపడేవారు నల్ల కళ్లద్దాలు ధరించాల్సి ఉంటుంది.
❁ వానా కాలంలో అతిగా టీవీ లేదా మొబైల్ చూడటం మానుకోవాలి.
❁ కళ్లను అసలు తాకకూడదు.
❁ వర్షంలో తడవకుండా ఉండాల్సి ఉంటుంది.


ఐ ఫ్లూ వచ్చినప్పుడు ఇలా చేయండి:
❁ తరచుగా ఇలాంటి సమస్యలతో బాధపడేవారు గోరువెచ్చని నీటితో కళ్లను శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.
❁ కళ్లను శుభ్రం చేయడానికి ముందు కాటన్ వస్త్రాన్ని ఉపయోగించి పైపై శుభ్రం చేయాలి.
❁ కంటి ఫ్లూ లక్షణాలు కనిపిస్తే తప్పకుండా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. 


Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook