Face Care Tips: ముఖంపై బ్లాక్‌హెడ్స్‌తో సమస్యగా ఉందా? ఈ ఫేస్‌మాస్క్ ట్రై చేయండి
Face Care Tips: ముఖ సౌందర్యం, ముఖ సంరక్షణ చాలా అవసరం. ముఖంపై దుమ్ము ధూళి పేరుకుపోయి..బ్లాక్‌హెడ్స్ అంటే నల్లటి మచ్చలతో ముఖం అంద వికారంగా మారుతుంటుంది. మరి ఈ సమస్య నుంచి గట్టెక్కేదెలా..
Face Care Tips: ముఖ సౌందర్యం, ముఖ సంరక్షణ చాలా అవసరం. ముఖంపై దుమ్ము ధూళి పేరుకుపోయి..బ్లాక్‌హెడ్స్ అంటే నల్లటి మచ్చలతో ముఖం అంద వికారంగా మారుతుంటుంది. మరి ఈ సమస్య నుంచి గట్టెక్కేదెలా..
నిత్యం వివిధ పనులతో బయట తిరిగేటప్పుడు దుమ్ము ధూళి కారణంగా ముఖంపై బ్లాక్‌హెడ్స్ నల్లటి మచ్చలు ఏర్పడుతుంటాయి. ఇవి ముఖాన్ని అందవికారంగా మార్చుతాయి. అయితే కొన్ని వంటింటి చిట్కాలతో హోమ్ రెమిడీస్ సహాయంతో బ్లాక్‌హెడ్స్ పొగొట్టుకోవచ్చు.
ఆధునిక పోటీ ప్రపంచం, బిజీ లైఫ్ కారణంగా పని ఒత్తిడితో సతమతమవుతుంటాం. నిత్యం బయట తిరుగుతుండటం వల్ల దుమ్ము ధూళికి మీ చర్మం త్వరగా ఎక్స్‌పోజ్ అవుతుంటుంది. ముఖంపై పింపుల్స్, బ్లాక్‌హెడ్స్ ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా మహిళలకు ఇది అతిపెద్ద సమస్యగా మారుతుంది. కొంతమంది మహిళల స్కిన్ సెన్సిటివ్‌గా ఉండటంతో మార్కెట్‌లో లభించే ఉత్పత్తులు వినియోగించలేరు. అందుకే కొన్ని హోమ్ రెమిడీస్ సహాయంతో ముఖంపై ఏర్పడే బ్లాక్‌హెడ్స్ తొలగించుకోవచ్చు. ముఖ సంరక్షణ చేసుకోవచ్చు.
బ్లాక్‌హెడ్స్ దూరం చేసే పద్ధతులు
ప్రతి వంటింట్లో టొమాటో సులభంగా లభిస్తుంది. టొమాటోలో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఫేస్‌మాస్క్ కోసం ముందుగా మినపపప్పును రుబ్బుకోవాలి. అందులో మిక్సీ చేసిన టొమాటో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై..ప్రత్యేకించి బ్లాక్0హెడ్స్ ఉన్న ప్రాంతాల్లో బాగా దట్టించి కాస్సేపు వదిలేయాలి. పూర్తిగా డ్రై అయిన తరువాత..నెమ్మదిగా చేత్తో తొలగించి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేస్తే మంచి ఫలితముంటుంది.
బియ్యంతో ఫేస్‌మాస్క్
ప్రతి ఇంట్లో తప్పకుండా లభించే బియ్యంతో కూడా ఫేస్‌మాస్క్ తయారు చేసుకోవచ్చు. ముందుగా బియ్యం గ్రైండ్ చేసుకుని..అందులో ఒక స్పూన్ తేనె వేసి పేస్ట్‌గా చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీరు కలపాలి. చేత్తో కొద్దికొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకుని ముఖానికి రాసుకోవాలి. పూర్తిగా డ్రై అయిన తరువాత..చేత్తో తొలగించాలి. తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే స్కిన్ గ్లో అవడమే కాకుండా బ్లాక్‌హెడ్స్ తొలగిపోతాయి.
Also read: Weight Loss Tips: స్థూలకాయం పోవాలంటే..డిన్నర్ ఎప్పుడు తీసుకోవాలి, కొవ్వు ఎలా కరుగుతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి