Facial Care Tips: ముఖంపై ఏ పదార్ధాలు రాయకూడదో తెలుసా, లేకపోతే మొదటికే మోసం
Facial Care Tips: శరీరంపై ఉండే సున్నితమైన అంగాల్లో ఒకటి చర్మం. చర్మం అనేది అందంగానే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉండాలి. ముఖ్యంగా వర్షాకాలంలో మరింత జాగ్రత్త అవసరం. ఏ పదార్ధాలు చర్మానికి హాని కల్గిస్తాయో చూద్దాం..
Facial Care Tips: శరీరంపై ఉండే సున్నితమైన అంగాల్లో ఒకటి చర్మం. చర్మం అనేది అందంగానే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉండాలి. ముఖ్యంగా వర్షాకాలంలో మరింత జాగ్రత్త అవసరం. ఏ పదార్ధాలు చర్మానికి హాని కల్గిస్తాయో చూద్దాం..
చర్మ సంబంధిత సమస్యలున్నప్పుడు చాలా చిట్కాలు పాటిస్తుంటాం. ఈ క్రమంలో ముఖంపై ఏదైనా రాసేముందు కాస్త అప్రమత్తత అవసరం. ఎందుకంటే మీరు పాటించే చిట్కాల వల్ల చర్మానికి హాని కలిగే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే చర్మం అనేది చాలా మృదువైనది. సున్నితమైంది. ప్రత్యేకించి ముఖంపై ఉండే చర్మం మరింత సున్నితంగా ఉంటుంది. ముఖంపై పింపుల్స్ వంటి సమస్యలున్నప్పుడు చిట్కాలు కానీ, ఏదైనా క్రీములు గానీ రాసేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. కొన్నిసార్లు సహజసిద్ధమైన పదార్ధాలతో కూడా చర్మానికి హాని కలగవచ్చు. అందుకే ముఖానికి ఏదైనా రాసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి.
ఏ పదార్ధాలు మంచివి కావు
నిమ్మరసం సహజంగానే అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యలకు మంచిది. కానీ ముఖంపై పింపుల్స్ ఉన్నప్పుడు నిమ్మరసం ఎట్టి పరిస్థితుల్లోనూ రాయకూడదు. ఎందుకంటే నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్ చర్మంపై దురద, మంట ఎక్కువై పింపుల్స్ సమస్య పెరుగుతుంది. యాక్నేపై నిమ్మరసం రాసినా..రియాక్షన్ ఉంటుంది. దీనివల్ల చర్మం మండుతుంది.
వెల్లుల్లి ప్రయోగం
మొటిమల్నించి విముక్తి పొందేందుకు చాలామంది వెల్లుల్ని ఉపయోగిస్తుంటారు. కానీ వెల్లుల్లిని ముఖంపై ఎప్పుడూ రాయకూడదు. వెల్లుల్లిల పొటాషియం, సోడియం వంటి గుణాలు అధికంగా ఉంటాయి. ఫలితంగా చర్మంపై మంట ఎక్కువౌతుంది. వెల్లుల్లి రాయడం వల్ల చర్మంపై మంట ఎక్కువై..చర్మం దెబ్బతింటుంది. వెల్లుల్లి వల్ల మొటిమలు తొలగినా..ముఖంపై మచ్చ ఉండిపోతుంది.
బెట్నోవిట్ క్రీమ్
చాలామంది తెలిసో తెలియకో..చర్మ సంబంధిత సమస్యలొచ్చినప్పుడు బెట్నోవిట్ క్రీమ్ రాసేస్తుంటారు. బెట్నోవిట్ క్రీమ్ వల్ల తక్షణం ఉపశమనం కలిగినా..ఇందులో ఉండే గుణాలు యాక్నేలో హాని చేకూరుస్తుంది. బెట్నోవిట్ క్రీమ్ అనేది ఒక స్టెరాయిడ్. ఇది చర్మంపై రియాక్షన్ కల్గిస్తుంది. పింపుల్స్, యాక్నే సమస్య ఇంకా పెరుగుతుంది.
బేకింగ్ సోడా
ఇక మరో చిట్కా చాలామంది అవలంభించేది బేకింగ్ సోడా ప్రయోగం. బేకింగ్ సోడా ముఖంపై రాయడం వల్ల చర్మం మండుతుంది. చర్మానికి మరింత నష్టం వాటిల్లుతుంది. ఇందులో సోడియం బైకార్బొనేట్ చర్మానికి అస్సలు మంచిది కాదు.
Also read: Flaxseeds Benefits: రోజూ తాగే పాలతో ఫ్లెక్స్‌సీడ్స్ తీసుకుంటే నెలరోజుల్లో అధిక బరువుకు చెక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook