Best Juice For Weight Loss: సాధారణంగా శరీరంపై ఉన్న మురికి, మలినాలను మనం ఎల్లప్పుడు తొలగిస్తాము. అలాగే శరీరం లోపలి వ్యర్థాలను కూడా తొలగించడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము. శరీరంలోని వ్యర్థాలు తొలగించుకోకపోతే తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.  మన శరీరంలోని వ్యర్థాలు, టాక్సిన్స్ ను తొలగించుకోవడానికి కొన్ని డ్రింక్స్ సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వ్యర్థాలును తొలగించడంలో కొన్ని రకాల జ్యూస్‌లు మనకు ఎంతో ఉపయోగపడుతాయి. వీటిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము. అంతేకాకుండా వేసవికాలంలో వీటిని తీసుకోవడం వల్ల ఎండల బారిన పడకుండా  ఉంటాము. అలాగే ఈ డ్రింక్స్‌లో లభించే పోషకాలు మనం శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరాని హైడ్రేట్‌గా ఉంచడంతో ఇవి కీలక ప్రాత పోషిస్తాయి. 


వ్యర్థాలను తొలగించే జ్యూస్‌:


నీరు: 


నీరు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి , వ్యర్థాలను తొలగించడానికి సహాయపడుతుంది. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. 


కొబ్బరి నీరు: 


కొబ్బరి నీరు శరీరానికి ఎలక్ట్రోలైట్స్ ను అందిస్తుంది. వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఒక రోజుకు ఒకటి లేదా రెండు కొబ్బరి నీళ్ళు తాగడం చాలా మంచిది.


పుచ్చకాయ జ్యూస్‌: 


పుచ్చకాయ రసం శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి, వ్యర్థాలను తొలగించడానికి సహాయపడుతుంది. ఒక రోజుకు ఒక గ్లాసు పుచ్చకాయ రసం తాగడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. 


టమాటో జ్యూస్‌: 


టమాటో రసం యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటుంది. ఇవి శరీరాన్ని శుభ్రపరచడంలో సహాయపడతాయి. ఒక రోజుకు ఒక గ్లాస్‌ తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. 


గ్రీన్ జ్యూస్: 


ఈ గ్రీన్‌ జ్యూస్‌ అనేది ఆకుకూరలు, కూరగాయలతో తయారు చేస్తారు. దీని తీసుకోవడం వల్ల మినరల్స్, విటమిన్‌ , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.


గోల్డెన్ మిల్క్: 


గోరు వెచ్చగా ఉన్న పాలలో కొంచెం పసుపు వేసుకుని తాగడం వల్ల శరీరంలో ఉన్న వ్యర్థాలు, టాక్సిన్స్ వెంటే తొలిగిపోతాయి. 


గ్రీన్ టీ: 


గ్రీన్‌ టీ తీసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు బాడీలో వాపును తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. అలాగే శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో ఎంతో మేలు చేస్తుంది. 


Also Read Ibomma: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter