Fennel Seeds For Weight Loss: సోంపు గింజలను ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. అంతేకాకుండా ఇది నోటిని రిఫ్రెష్‌గా చేయడానికి కూడా సహాయపడుతుంది. అయితే శరీర బరువును తగ్గించడానికి కూడా వినియోగించవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడమేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అనేక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది. అయితే శరీర బరువును తగ్గించడానికి సోంపును ఎలా వినియోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోంపును తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
జీవక్రియ వ్యవస్థ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
మూత్ర విసర్జన సమస్యల నుంచి విముక్తి కలిగించడానికి ప్రభావవంతంగా సహాయపడుతుంది.
హైపర్ టెన్షన్ సమస్యల నుంచి దూరం చేస్తుంది.
కళ్ల బలహీనతను తగ్గించడానికి సహాయపడుతుంది.
గ్యాస్, ఉబ్బరం వంటి జీర్ణక్రియ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది.
ఆకలిని పెంచుతుంది.
శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి సోంపు నీరు ప్రభావవంతంగా సహాయపడుతుంది.


సోంపును ఇలా వినియోగించండి:
బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ప్రతి రోజూ ఉదయం పూట ఖాళీ కడుపుతో సోంపు నీటిని తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగి స్తుంది.


సోంపును ఇలా తినండి:
సోంపును నమిలి తినండి వల్ల కూడా సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా నోటిని రిఫ్రెష్‌గా ఉంచడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ప్రతి రోజూ సోంపును తినాల్సి ఉంటుంది.


సోంపు టీ:
సోంపుతో తయారు చేసిన టీని తాగడం వల్ల కూడా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి ప్రభావవంతంగా సహాయపడుతుంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read:  Rahul Sipligunj : బికినీ భామలతో రాహుల్ సిప్లిగంజ్ రొమాన్స్.. బడ్జెట్ బద్దల్ బాషింగాలైంతాందట!


Also Read: Naga Chaitanya - Samantha : నాగ చైతన్య అంటే మరీ అంత ద్వేషమా?.. అందుకే అలా చేసిందా? సమంతకు చైతూకి అదే తేడా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook