Fennel water health benefits: మనం ప్రతిరోజు ఉదయం తీసుకునే పానీయాలు ఆహారాలే మన శరీరాలు ఆరోగ్యానికి తోడ్పడతాయి. అందుకే శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాలు మాత్రమే ఉదయం డైట్ లో చేర్చుకోవాలి. ఇవి బాడీ మెటపాలిజం రేటును పెంచుతాయి. తగిన శక్తిని అందిస్తాయి. అయితే ఉదయం సోంపునీటిని మన డైట్ లో చేర్చుకోవడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మనం సోంపును సాధారణంగా మౌత్ ఫ్రెషనర్‌ గా వాడతాం. దీని వల్ల జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. సోంపును కొన్ని వంటల్లో కూడా ఉపయోగిస్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోంపును మన డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. మంచి జీర్ణక్రియకు తోడ్పడుతుంది. సీజనల్ వ్యాధులు రాకుండా మన బాడీకి ఒక షీల్డ్ లాగా కాపాడుతుంది. సోంపు తో తయారు చేసిన నీటిని తాగడం వల్ల మన శరీరానికి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.


మంచి జీర్ణక్రియ..
ప్రతిరోజు సోంపు నీటిని లేకపోతే సోంపు గింజలను తినడం వల్ల మంచి జీర్ణక్రియకు తోడ్పడుతుంది. శ్వాస సంబంధిత సమస్యలకు చెక్ పెడుతుంది. సోంపుతో తయారుచేసిన నీటిని ఉదయం ఖాళీ కడుపున తీసుకోవడం వల్ల మన శరీరానికి ఆ రోజంతటికి తగిన శక్తి అందుతుంది. మంచి ఆరోగ్యానికి సహకరిస్తుంది.


బరువు తగ్గుతారు..
సోంపు నీటిని ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల మన బాడీ మెటబాలిజం రేటు పెరగడంతో పాటు బరువు కూడా ఈజీగా తగ్గిపోతారు. మన శరీరంలో కావలసిన ఖనిజాలను గ్రహించడంలో తోడ్పడుతుంది బెల్లీ ఫ్యాట్ ని తగ్గిచేస్తుంది.


ఇదీ చదవండి: మీకు కిడ్నీలను క్లీన్ చేసే 8 ఆహారాలు..  పాడవ్వకుండా నిత్యం కాపాడతాయి..


బ్రెస్ట్ ఫీడింగ్..
పాలిచ్చే తల్లులు తమ డైట్ లో సోంపు నీటిని తెర్చుకోవటం వల్ల పాలు పెరుగుతాయి. ఇందులో గ్యాలక్సీనిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఏదో విధంగా డైట్లో చేర్చుకోవడం మంచిది.


గుండె ఆరోగ్యం..
ముఖ్యంగా సోంపులో మంచి ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ ని వాపు చెడు కొలెస్ట్రాల్ బయటికి మన శరీరం నుంచి పంపించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. దీంతో మన గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.


ఇదీ చదవండి: ఈ ఒక్క టీ తాగితే.. రక్తంలో చక్కెర స్థాయిలు ఎప్పటికీ పెరగవు..


ఓరల్ హెల్త్..
సోంపు నీరు సాధారణంగా యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటుంది. ఇది పంటి ఆరోగ్యానికి కూడా మంచిది. అంతేకాదు ఇది నోటి నుంచి వచ్చే దుర్వాసనను పోగొడుతుంది. సలైవా ఉత్పత్తికి ప్రేరేపిస్తుంది. దీంతో పంటికి పేరుకున్న బ్యాక్టీరియా సులభంగా తొలగిపోతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి