Find My Device: దొంగిలించిన స్మార్ట్ ఫోన్ ను ట్రాక్ చేయడం ఎలానో తెలుసా..?
Find My Device: మీ స్మార్ట్‌ఫోన్ ఎక్కడో పోయినా లేదా ఎవరైనా దొంగిలించినా.. దాన్ని కనుగొనడం ఇప్పుడు సులభం. మీరు పోగొట్టుకున్న ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉన్నప్పటికీ దాన్ని ట్రాక్ చేయడానికి అవసరమైన ట్రిక్స్ ను మేము ఇప్పుడు తెలియజేయబోతున్నాం.
Find My Device: ఆధునిక కాలంలో ప్రతి ఇంట్లో సెల్ ఫోన్ కచ్చితంగా ఉంటుంది. ఈ క్రమంలో చాలా మంది అనేక సార్లు తమ స్మార్ట్ ఫోన్స్ ను పొగొట్టుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే మన స్మార్ట్ ఫోన్ పోయినా.. ఎవరైనా దొంగిలించినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలా సెల్ ఫోన్ పొగొట్టుకున్న వారి కోసమే కొన్ని ట్రిక్స్ మీ ముందుకు తీసుకొచ్చాం. వాటి సహాయంతో మీ మొబైల్ స్విచ్ ఆఫ్ లో ఉన్నా.. సులభంగా ట్రాక్ చేయవచ్చు.
ఫోన్ పోయిన వెంటనే ఈ పని చేయండి!
మీ ఫోన్ పోగొట్టుకున్నా లేదా ఎవరైనా దొంగిలించినా.. ముందుగా మీ ఫోన్ నంబర్‌కు కాల్ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు ఆ సెల్ ఫోన్ దగ్గర్లోనే ఉంటే దాన్ని వెంటనే కనుగొనవచ్చు. కొన్నిసార్లు మనం పోగొట్టుకున్న ఫోన్ మరొకరికి దొరకవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ముందుగా మన మొబైల్ కు కాల్ చేయడం మేలు. మీ స్మార్ట్ ఫోన్ కు కచ్చితంగా పాస్ వర్డ్ సెట్ చేసుకోండి. దాని వల్ల మీ మొబైల్ ను యాక్సెస్ చేయడం కొంచెం కష్టంగా మారుతుంది. దీంతో మీ మొబైల్ ను మీరు వెంటనే కనుగొనవచ్చు.
ఐఫోన్ ట్రాక్ చేయడం ఎలా?
మనలో చాలా మంది ఇప్పుడు Apple iPhone లు యూజ్ చేస్తున్నారు. అలాంటి వారు తమ ఐఫోన్ ను పోగొట్టుకుంటే.. దాన్ని కనిపెట్టడం చాలా సులభం. ముందుగా మీ Apple IDతో మరొక ఐఫోన్ లో లాగిన్ అవ్వండి. దీంతో మీ ఐఫోన్ చివరిసారిగా వాడిన డేటాను మీరు తెలుసుకోవచ్చు.
'ఫైండ్ మై ఫోన్' ఆప్షన్ తో మీ ఐఫోన్ ను ట్రాక్ చేయవచ్చు. ఒకవేళ మీ స్మార్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా.. 24 గంటల లోపు అది ఎక్కడ ఉందో ట్రాక్ చేయవచ్చు. మీ దగ్గర్లో మరో Apple iPhone లేకపోతే.. iCloud.com లో లాగిన్ అయ్యి, అందులో వివరాలను పొందుపరిచి మొబైల్ జాడను తెలుసుకోవచ్చు.
ఆండ్రాయిడ్ ఫోన్ ట్రాక్ కోసం..
ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ యూజర్ అయితే.. దాన్ని కనుగొనడానికి మీరు ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్‌లోని 'ఫైండ్ మై డివైజ్' ఫీచర్‌ని ఉపయోగించవచ్చు. మీ ఫోన్ యొక్క GPS ఫీచర్ ఆన్ చేయబడితే మాత్రమే Android స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన లొకేషన్ ట్రాకింగ్ ద్వారా అదెక్కడ ఉందో కనుగొనవచ్చు. మీరు మీ డివైజ్ లో లోకేషన్ ఆన్ చేయకపోతే ఈ ఫీఛర్ వల్ల ఉపయోగం లేదు.
మీ దగ్గర మరో ఆండ్రాయిడ్ ఫోన్ లేకపోయిన పక్షంలో Android.com/Find కి సైన్ ఇన్ చేయడం ద్వారా మీ ఫోన్‌ను గుర్తించడానికి కూడా ప్రయత్నించవచ్చు. ఇలా చేయడం ద్వారా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ చివరి వినియోగం వివరాలను తెలుసుకోవచ్చు. దీని వల్ల మీ ఫోన్ ను సులభంగా ట్రాక్ చేయవచ్చు. మీ మొబైల్ లోని డేటాను కూడా తొలగించవచ్చు.
Also Read: Amazon Sale: రూ.4 వేల విలువైన బ్లూటూత్ ఇయర్ బడ్స్ ఇప్పుడు రూ.899లకే.. ఈ ఆఫర్ ఒక్కరోజు మాత్రమే!
Also Read: Amazon Tecno Pop 5 LTE: రూ.9 వేల విలువైన స్మార్ట్ ఫోన్ ను రూ.349లకే కొనేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook