అవిసె గింజలు లేదా ఫ్లక్స్ సీడ్స్ ఆరోగ్యానిక్ చాలా చాలా మంచివి. అయితే వీటిని పొరపాటున కూడా పచ్చివి తినకూడదు. రోస్ట్ చేసి తినడం మంచి మార్గం. ఫ్లక్స్ సీడ్స్ ఏ విధంగా తీసుకోవాలనేది పరిశీలిద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్లక్స్ సీడ్స్‌లో ఫైబర్, ప్రోటీన్లు, కాపర్, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ చాలా సందర్భాల్లో ఫ్లక్స్ సీడ్స్ తినే విధానం సరిగ్గా లేకపోవడం వల్ల సరైన ప్రయోజనం కలగదు. ఎందుకంటే చాలామంది అవిసె గింజల్ని పచ్చిగానే తినేస్తుంటారు. కానీ ఈ అలవాటు మంచిది కాదు. మరి ఎలా తినాలో తెలుసుకుందాం..


ఫ్లక్స్ సీడ్స్ తినే విధానం


ఫ్లక్స్ సీడ్స్‌ను లడ్డూ తయారీలో ప్రముఖంగా ఉపయోగిస్తారు. ఇందులో ఉండే ప్రోటీన్లు, ఫైబర్ శరీరానికి బలాన్నిస్తాయి. ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ముందుగా పిండి, ఫ్లక్స్ సీడ్స్ లైట్‌గా రోస్ట్ చేయాలి. ఇప్పుడు డ్రైఫ్రూట్స్ కలిపి లడ్డూ తయారు చేసుకోవాలి. ఫ్లక్స్ సీడ్స్ లడ్డూతో శరీరంలో పటిష్టమౌతుంది.


హల్వా


ఫ్లక్స్ సీడ్స్ హల్వా రూపంలో కూడా తీసుకోవచ్చు. అవిసె గింజల్ని లైట్‌గా రోస్ట్ చేసి ఇందులో అంటే హల్వాలో కలిపి తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యం కలుగుతుంది. అదే సమయంలో రుచి కూడా పెరుగుతుంది. గార్నిష్‌గా కూడా వేయవచ్చు.


సలాడ్


సలాడ్ ఆరోగ్యానికి చాలా మంచిది. సలాడ్‌లో రోస్ట్ చేసిన ఫ్లక్స్ సీడ్స్ కలిపి తింటే జీర్ణక్రియ సంబంధ మస్యలు దూరమౌతాయి. సలాడ్ రూపంలో తీసుకుంటే..శరీరానికి పోషక పదార్ధాలు అందడమే కాకుండా..మలబద్ధకం, ఎసిడిటీ సమస్య దూరమౌతుంది. అందుకే ఫ్లక్స్ సీడ్స్‌ను రోస్ట్ చేసి మాత్రమే తినాలి.


Also read: Vitamin B12: విటమిన్ బి12 కేవలం చేపలు, మాంసంలోనే కాదు..ఈ పదార్ధాల్లో కూడా పుష్కలం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook