How to make kids sleep early : చిన్నపిల్లల మానసిక శారీరక ఎదుగుదలకి మంచి ఆహారంతో పాటు చక్కటి నిద్ర కూడా చాలా అవసరం. సరిపడా నిద్రపోతేనే.. చిన్న పిల్లలు యాక్టివ్ గా ఉండగలరు. కానీ పిల్లల్ని త్వరగా నిద్రపుచ్చటం కూడా అంత సులువైన విషయం ఏమీ కాదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా కొందరు తల్లిదండ్రులు ఒక్కోసారి.. పిల్లల్ని నిద్రపుచ్చడానికి చాలా కష్టాలు పడుతూ ఉంటారు. పిల్లలు త్వరగా పడుకోరు.. పడుకున్నా మధ్య రాత్రులలో లేస్తూ ఉంటారు.. ఏడుస్తూ ఉంటారు.. నిద్రను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. చాలా వరకు చిన్న పిల్లలు నిద్రపోవడానికి ఇష్టపడరు. కానీ తల్లిదండ్రులు వారిని నిద్రపుచ్చాల్సి ఉంటుంది.


పిల్లలు ఎంత సేపు నిద్రపోవాలి..


మూడు నుంచి ఐదు సంవత్సరాల వయసున్న పిల్లలు రోజుకి కనీసం 10 నుంచి 13 గంటల పాటు నిద్రపోవాలి. 6 నుంచి 12 ఏళ్ల లోపు పిల్లలు 9 నుంచి 11 గంటలు నిద్ర పోవాల్సి ఉంటుంది. 18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు ఏడు నుంచి తొమ్మిది గంటలు నిద్రపోతే సరిపోతుంది. 


పిల్లలకు నిద్ర తక్కువైంది అని చెప్పడం ఎలా..


పిల్లలకు నిద్ర తక్కువ అయితే వారిలో కొన్ని సంకేతాలను తల్లిదండ్రులు గుర్తించవచ్చు. పిల్లలు సరిగ్గా ప్రవర్తించినప్పుడు, ఓవర్ యాక్టివ్ గా ఉన్నప్పుడు వారికి సరైన నిద్ర అందలేదని అనుకోవచ్చు. చదువులో వెనుకబడి ఉన్నా.. శారీరకంగా ఎదుగుదల ఎక్కువ లేకపోయినా కూడా.. పిల్లల నిద్ర గురించి తల్లిదండ్రులు పరిశీలించాల్సి ఉంటుంది. చిన్నపిల్లల ఆహారం విషయంలో మాత్రమే కాక నిద్ర విషయంలో కూడా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. 


పిల్లలు నిద్ర పోకపోవడానికి కారణాలు.. 


సాధారణంగానే పిల్లలు త్వరగా నిద్ర పోవడానికి ఇష్టపడరు. మధ్య రాత్రి లేచినా కూడా మళ్లీ నిద్రపోవడానికి మారం చేస్తూ ఉంటారు. తరచూ ఇల్లు మారినా.. లేదా పిల్లలు నిద్రపోయే ప్లేస్ మారినా.. వారికి నిద్ర సరిగా పట్టకపోవచ్చు. ఇంట్లో జరిగే గొడవలు.. స్కూల్లో వాళ్లకి కలిగే ఇబ్బందులు.. వంటి కారణాలు కూడా వారి నిద్రను ప్రభావితం చేస్తూ ఉంటాయి. 


పిల్లలను త్వరగా నిద్రపోచడం ఎలా..


పిల్లలతో పాటు పెద్దలు కూడా త్వరగా నిద్రపోవడం మంచిది. పెద్దలను చూసే పిల్లలు నేర్చుకుంటారు. ముందు ఇంట్లో తల్లిదండ్రులు పడుకుంటే వాళ్లు కూడా నిద్రలోకి జారుకుంటారు. నిద్రపోయే ముందు పిల్లలను కి గోరువెచ్చటి నీటితో స్నానం చేయించినా.. పుస్తకాలు చదవడం వంటి మంచి అలవాట్లు నేర్పించినా కూడా.. వాళ్ళు త్వరగా నిద్రపోతారు. పిల్లలు నిద్రపోయే కనీసం రెండు గంటల ముందే టీవీ చూడటం, వీడియో గేమ్స్, సోషల్ మీడియా వంటివి ఆపేయాలి. ప్రశాంతమైన వాతావరణం ఉన్నా కూడా పిల్లలు చక్కగా నిద్రపోతారు.


Also Read: Narendra Modi: వైసీపీ పాలనలో అభివృద్ధి సున్నా.. వచ్చేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే


Also Read: AP New DGP: ఏపీ కొత్త పోలీస్‌ బాస్‌ హరీశ్‌కుమార్‌ గుప్తా.. గంటల్లోనే వేగంగా మారిన పరిణామాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter