Foods Lead Kidney Stones: కిడ్నీలో రాళ్లతో బాధపడేవారు ఇవి తినకూడదు!
Foods Causes Kidney Stones: కిడ్నీలో రాళ్లు సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. ఈ సమస్య వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే కొన్ని ఆహార పదార్థాలను వల్ల కిడ్నీలో రాళ్ల సమస్యకు దారితీస్తున్నాయి.
Foods Causes Kidney Stones: కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కొన్ని ఆహారపదార్ధాలు దారితీస్తాయి. వీటిని తినకుండ ఉండటం ఏంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఆ పదార్థాలు ఏంటో మనం తెలుసుకుందాము.
కిడ్నీలో రాళ్లతో బాధపడేవారు ఖచ్చితంగా తీసుకోకూడని ఆహార పదార్థాలలో పాలకూర ఒకటి. దీనిని తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు చేరుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
అలాగే గుమ్మడి కాయను కూడా తీసుకోకుండ ఉండాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
టొమాటో, క్యాలీఫ్లవర్ వంటి కూరగాయలను తీసుకోవడం వల్ల కూడా ఈ కిడ్నీలో రాళ్లు ఏర్పడుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
కూరగాయలు కాకుండా కొన్ని రకమైన పండ్లు తీసుకోవడం వల్ల కూడా ఈ కిడ్నీలో రాళ్లు ఏర్పడుతాయి.
సపోటాను ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పుడాయిని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
పుట్టగొడుగులను ఇష్టంగా తినే వారు ఉంటారు. కానీ కిడ్నీ సమస్యతో బాధపడే వారు దీని తీసుకుండా ఉండాలి.
ఉసిరికాయ, దోస కాయ, వంకాయ, క్యాబేజీ వంటి వాటిని కూడా కిడ్నీ వ్యాధి వారు తీసుకుండా ఉండటం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.
డీప్‌గా వేయించిన చికెన్, ఉప్పుతో వేయించిన గింజలు వంటి సోడియం అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలని నిపుణులు అంటున్నారు.
కూల్ డ్రింక్స్ , పానీయాలు కోలా కార్బోనేటేడ్ వాటికి కూడా చెక్ పెట్టాలి.
పిజ్జాలు, బర్గర్లు, శాండ్ విచ్‌లు వగైరా ఫాస్ట్ ఫుడ్స్ వల్ల కూడా కిడ్నీలో రాళ్లు చేరుతాయి.
ప్రాసెస్ చేసిన మాంసాలు, ఉప్పుతో మాంసాహారం తీసుకోకుండా ఉండాలి.
బాదం, జీడిపప్పులు తింటే కిడ్నీస్టోన్స్ వచ్చే అవకాశం వుంటుంది.
చక్కెర, ఉప్పు ఎక్కువ కలిగిన ఏదైనా ఆహారానికి దూరంగా ఉండాలి.
అధిక కంటెంట్‌లో ఉండే చిప్స్ , గింజలు కూడా రాళ్ల పెంచుతాయి.
చాక్లెట్లు కూడా దూరంగా ఉండాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదని అంటున్నారు.
ఫాస్ఫేట్ , ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter