Monsoon Foot Care Tips: పాదాలు నీటిలో నానడం వల్ల ఇన్ఫెక్షన్లు వస్తున్నాయా? ఈ 5 టిప్స్‌ను పాటించండి చాలు..
Foot Care Tips In Monsoon: వర్షాకాలంలో తరచుగా చాలామందిలో పాదాల్లో ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండాలంటే ఆరోగ్య నిపుణులు సూచించిన పలు చిట్కాలు పాటించడం చాలా మంచిది. ఈ టిప్స్ ను పాటించడం వల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారు.
Foot Care Tips In Monsoon: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పరిమాణాలు విచ్చలవిడిగా పెరుగుతాయి దీని కారణంగా సులభంగా ఇన్ఫెక్షన్ల బారిన పడతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వానాకాలంలో తప్పకుండా శరీరం. చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా వానల కారణంగా రోడ్లపై తరచుగా వాటర్ లాగిగ్ సమస్యలు వస్తూ ఉంటాయి. దీంతో మనం నీటిలో ఎక్కువగా నడవడం కారణంగా పాదాలలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పాదాలను ఎప్పుడు పొడిగా ఉంచుకోండి:
వానాకాలంలో మనం నడిచే క్రమంలో పాదాల కింద నీరు రావడం మీరు గమనించవచ్చు. దీని కారణంగా గోరుచుట్టు ఇన్ఫెక్షన్ రావడం మొదలవుతుంది. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా పాదాలను పొడిగా ఉంచుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా నానిన పాదాలపై దుమ్ముదులి పడకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా
యాంటిసెప్టిక్‌తో కడగాలి:
వర్షాకాలంలో బయట నుంచి ఇంటికి వచ్చాక పాదాలను యాంటీ సెప్టిక్ లిక్విడ్తో శుభ్రం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చేయడం వల్ల పాదాలపై పేరుకుపోయిన బ్యాక్టీరియా వెంటనే చనిపోతుందని, దీని కారణంగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తరచుగా ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న వారు ఈ చిట్కాను తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.
గోరువెచ్చని నీటిలో పాదాలను ఉంచాలి:
తరచుగా పాదాల్లో ఇన్ఫెక్షన్ కారణంగా దూరద వంటి సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా మీ పాదాలను గోరువెచ్చని నీటిలో ఐదు నిమిషాల పాటు ఉంచాల్సి ఉంటుంది. అంతేకాకుండా బోరువెచ్చని గ్రీన్ టీతో పాదాలను శుభ్రం చేయడం వల్ల కూడా బ్యాక్టీరియా పెరగదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
బేకింగ్ సోడాతో శుభ్రం చేసుకోండి:
రోజు ఉదయం మీ పాదాలను గోరువెచ్చని బేకింగ్ సోడా నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల వానాకాలంలో పాదాల ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉంటారు. అంతేకాకుండా మీ పాదాలను ఐదు నుంచి పది నిమిషాల పాటు బేకింగ్ సోడా నీటిలో నానబెట్టడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందుతారు.
గోళ్లను శుభ్రంగా ఉంచండి:
చాలామంది గోళ్లను పెద్దవిగా పెంచుకుంటూ ఉంటారు. వానాకాలంలో ఇలా పెంచుకోవడం వల్ల చాలా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వర్షాకాలంలో గోళ్లను ఎప్పటికప్పుడు కట్ చేసుకోవడం చాలా మంచిది.
Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook