Fruits To Avoid In Monsoon: వర్షాకాలం ఎండ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా వాతావరణంలో తేమ శాతం ఒక్కసారిగా పెరిగిపోయి. అయితే దీని ప్రభావం శరీరంపై కూడా పడుతుంది. ఈ సీజన్‌లో తప్పకుండా శరీరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సీజన్‌లో తేమ కారణంగా, ముక్కు దిబ్బడ సమస్య, శరీరానికి తగినంత ఆక్సిజన్ అందకపోవడం, రోగనిరోధక శక్తి వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటి క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వానా కాలంలో చాలా మంది తినకూడని ఆహారాలు తింటూ ఉంటారు. చాలా మంది ఎక్కువగా అనారోగ్యకరమైన ఆహారాలతో పాటు, తినకూడని పండ్లను తింటారు. అయితే వీటిని తినడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా చాలా మందిలో ముక్కు మూసుకుపోవడం వల్ల శరీరానికి ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా కొందరిలో శరీరం pH స్థాయిలు కూడా తగ్గుతాయి. కాబట్టి ఆరోగ్య నిపుణులుర సూచించిన పలు పండ్లను తీసుకోకపోవడం చాలా మంచిది.


వానా కాలంలో ఆహారంలో మార్పులు చేర్పులు చేసుకోవాలి:
వర్షాకాలంలో అందరూ ప్రతి రోజు తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. చాలా మందిలో వర్షం కారణంగా నోటీ రుచి కోల్పోతారు. దీని కోసం పండ్లను తీసుకుంటారు. అయితే ఇలాంటి తీసుకునే క్రమంలో తప్పకుండా ఈ కింది పండ్లకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఒక వేళ వీటిని తింటే బ్యాక్టీరియా వేగంగా వ్యాపించే ఛాన్స్‌ ఉంటుంది. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయిని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. 


Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?


వర్షంలో ద్రాక్ష నుంచి తినొద్దు:
వర్షకాలంలో ద్రాక్ష పండ్లను అసలు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి నోటికి తీపితో పాటు పులుపును కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని వర్షాకాలంలో తీసుకోవడం వల్ల తీవ్ర పొట్ట సమస్యలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా గ్యాస్‌, ఎసిడిటీ, ఉబ్బరం వంటి సమస్యలు కూడా రావచ్చు. 


స్ట్రాబెర్రీలు:
ద్రాక్షలాగానే స్ట్రాబెర్రీలను తినడం పొట్టకు హానికరమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని తినడం వల్ల  కడుపునొప్పి, తిమ్మిర్లు, గ్యాస్ సమస్యలు వస్తూ ఉంటాయి. వర్షాకాలంలో తరచుగా స్ట్రాబెర్రీలను తినడం వల్ల విరేచనాల సమస్యలు కూడా వస్తాయి. 


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook