Gold facial at Home: ఎంతో ఖరీదైన గోల్డెన్ ఫేషియల్ ఇలా ఇంట్లో ఫ్రీగా..అవును ఎలాంటి ఖర్చులేకుండా ఇలా చేసుకోవచ్చు..
Gold facial at Home: వాతావరణం లోని కాలుష్యం పెరగడం వల్ల చాలా మంది ముఖంపై చర్మ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యలతో బాధపడుతున్న వారు మార్కెట్లో లభించే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వినియోగిస్తున్నారు. ముగించిన ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు.
Gold facial at Home: ప్రస్తుతం చాలామంది ముఖం సౌందర్యవంతంగా కనిపించేందుకు మార్కెట్లో లభించే చాలా రకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ను వినియోగిస్తున్నారు. ఇవి చాలా ఖరీదైనప్పటికీ చర్మంపై ఎలాంటి ప్రభావం చూపలేకపోవడంతో ఫలితం పొందలేకపోతున్నారు. అంతేకాకుండా కొంతమంది అయితే వీటితో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ బారిన కూడా పడుతున్నారు. అయితే ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన వస్తువులతో కూడా గోల్డెన్ ఫేషియల్ చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఫేషియల్ ను చేసుకోవడానికి ప్రాసెస్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
పాలతో ఇలా చేయండి:
గోల్డెన్ ఫేషియల్ కోసం ముందుగా ఒక గిన్నెలో టేబుల్ స్పూన్ పాలను తీసుకొని అందులో ఒక దూదిని ముంచి దానిని ముఖంపై అప్లై చేయండి అంతేకాకుండా మెడ భాగంలో కూడా అప్లై చేసి బాగా ఆరనివ్వాలి. ఇలా ఆరనిచ్చిన తర్వాత ఐదు నిమిషాల పాటు మసాజ్ చేయాలి.
ఆవిరి:
పైన అప్లై చేసిన పాలను శుభ్రం చేసుకోవడానికి ఆవిరిని వినియోగించాల్సి ఉంటుంది. దీనికోసం వేడినీటితో ఆవిరివేసి.. ఐదు నుంచి పది నిమిషాల పాటు ఆవిరి ముందు మీ తలభాగాన్ని ఉంచాల్సి ఉంటుంది. ఆ తర్వాత కాటన్ గుడ్డతో ముఖంపై ఉన్న ఆవిరిని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.
స్క్రబ్ చేయండి:
ఒక టీ స్పూన్ నిమ్మరసం అందులో పంచదార తేనెను కలిపి ముఖాన్ని స్క్రబ్ చేయాల్సి ఉంటుంది. ఇలా స్క్రబ్ చేసిన తర్వాత మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు చిన్నపాటి మసాజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా మసాజ్ చేసిన తర్వాత ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టాల్సి ఉంటుంది.
ఫేస్ ప్యాక్:
గోల్డెన్ ఫేషియల్ కోసం ఫేస్ ప్యాక్ ను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ముందుగా పెరుగు, పసుపు, నిమ్మరసం, ఆలివ్ ఆయిల్, తేనెను ఒక గిన్నెలో మిక్స్ చేసుకొని ముఖంపై అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్న మిశ్రమం ఆరిన వెంటనే మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల సులభంగా చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు.
Also Read : Nandamuri Balakrishna : దిల్ లేని రాజు.. దిల్ రాజు.. బాలయ్య పంచ్‌లు
Also Read : Jabardasth Sri Satya : పొట్టి డ్రెస్సులో జబర్దస్త్ బ్యూటీ.. కొత్త లుక్కులో సత్య శ్రీ అదుర్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook