Google Maps Unknown Features: గూగుల్ మ్యాప్స్ అంటే సాధారణంగా నిర్ణీత అడ్రస్‌కు చేరేందుకు లేదా రూట్ మ్యాప్ కోసం మాత్రమే వాడుతుంటాం. కానీ గూగుల్ మ్యాప్స్‌లో ఉండే అత్యంత ఉపయోగకరమైన ఒక టూల్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఇది మిమ్మల్ని ప్రమాదాల్నించి, ట్రాఫిక్ చలాన్ల నుంచి రక్షిస్తుంది. అదేంటో ఎలాగో చూద్దాం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే దారి తెలియకపోయినా ఫరవాలేదు. గూగుల్ తల్లిని నమ్మకుని వెళ్లిపోగలుగుతున్నాం. గూగుల్ మ్యాప్స్ సహాయంతో ఎక్కడికి వెళ్లానన్నా సరిగ్గా వెళ్లిపోతున్నాం. దారి తప్పడమనే పరిస్థితి ఉండటం లేదు. గూగుల్ మ్యాప్స్ చాలా అద్భుతమైన టూల్‌గా ఉంటోంది. అయితే గూగుల్ మ్యాప్స్ అనేది యాక్సిడెంట్స్ నుంచి కూడా కాపాడుతుందని ఎంతమందికి తెలుసు.. ట్రాఫిక్ చలాన్ల నుంచి కూడా తప్పిస్తుందని తెలుసా మీకు. ఈ రెండు ఫీచర్ల గురించి చాలామందికి తెలియదు. సులభమైన పద్ధతుల ద్వారా అదెలాగో తెలుసుకుందాం.


గూగుల్ మ్యాప్స్‌లోని ఈ ఫీచర్ పేరు స్పీడ్ లిమిట్ వార్నింగ్. ఇందులో మీ వాహనం స్పీడ్‌ను గూగుల్ పసిగడుతుంది. ఎక్కువ స్పీడ్ అందుకుంటే వెంటనే అలర్ట్ చేస్తుంది. ఎక్కువ శాతం ప్రమాదాలు ఓవర్ స్పీడ్ కారణంగానే జరుగుతుంటాయి. అందుకే తక్కువ స్పీడ్‌తో వెళితే..ప్రమాదాలు కూడా తగ్గుతాయి. అవసరానికి మించిన వేగం ఉంటే..ట్రాఫిక్ చలాన్లు కూడా ఉంటాయి. అందుకే స్పీడ్ లిమిట్ అలెర్ట్ అనేది చలాన్ల నుంచి కూడా రక్షిస్తుంది. మీ వాహనం స్పీడ్‌ను నియంత్రిస్తుంది. ఫలితంగా ప్రమాదాలు తగ్గుతాయి.


స్పీడ్ లిమిట్ టూల్ ఎలా యాక్టివ్ చేయాలి


మీ మొబైల్ ఫోన్‌లో స్పీడ్ లిమిట్ టూల్ వినియోగించేందుకు మీరు గూగుల్ మ్యాప్స్ లేటెస్ట్ వెర్షన్ అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. గూగుల్ మ్యాప్స్‌లో వెళ్లి కూడా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆ తరువాత గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి..ఎడమ చేతివైపు కన్పించే ప్రొఫైల్ ఐకాన్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు సెట్టింగ్స్ ఆప్షన్‌లో వెళ్లి..నేవిగేషన్ సెట్టింగ్స్ ప్రెస్ చేయాలి.  ఇప్పుడు స్పీడజ్ లిమిట్ సెట్టింగ్స్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తరువాత స్క్రీన్ కింద ఉన్న డ్రైవింగ్ ఆప్షన్‌కు వెళ్లాలి.  చివరిగా స్పీడ్ లిమిట్ అండ్ స్పీడోమీటర్ ఆప్షన్‌కు వెళ్లాలి. ఆ తరువాత మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఫీచర్ ఆన్ అవుతుంది. స్పీన్ లిమిట్‌పై ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంటుంది. 


Also read: Chicken With Skin: పసందైన కోడికూర విత్ స్కిన్ తింటేనే మంచిదంట..హార్వర్డ్ స్కూల్ కొత్త పరిశోధన


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook