Chicken With Skin: పసందైన కోడికూర విత్ స్కిన్ తింటేనే మంచిదంట..హార్వర్డ్ స్కూల్ కొత్త పరిశోధన

Chicken With Skin: కోడికూర. అందరికీ ఇష్టమైనది. మటన్ , ఫిష్ కంటే ఎక్కువశాతం ఇష్టపడేది పసందైన చికెన్‌నే. మరి ఈ పసందైన చికెన్ స్కిన్‌లెస్‌గా ఎందుకు..విత్ స్కిన్‌నే తినమంటున్నారు హార్వర్డ్ పరిశోధకులు. ఆ వివరాలివీ..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 27, 2022, 05:14 PM IST
  • పసందైన కోడికూరను విత్ స్కిన్ తినమంటున్న పరిశోధకులు
  • హార్వర్డ్ స్కూల్ ఆఫ్ హెల్త్ కొత్త అధ్యయనం ఆసక్తికర విషయాలు
  • చికెన్ విత్ స్కిన్ గుండెకు మంచిదంటున్న పరిశోదకులు
Chicken With Skin: పసందైన కోడికూర విత్ స్కిన్ తింటేనే మంచిదంట..హార్వర్డ్ స్కూల్ కొత్త పరిశోధన

Chicken With Skin: కోడికూర. అందరికీ ఇష్టమైనది. మటన్ , ఫిష్ కంటే ఎక్కువశాతం ఇష్టపడేది పసందైన చికెన్‌నే. మరి ఈ పసందైన చికెన్ స్కిన్‌లెస్‌గా ఎందుకు..విత్ స్కిన్‌నే తినమంటున్నారు హార్వర్డ్ పరిశోధకులు. ఆ వివరాలివీ..

కోడికూరంటే ఇష్టముండని వాళ్లుండరు. నూటికి 80 శాతం మందికి కూడి కూర అంటే ఇష్టమే. మటన్, ఫిష్, ప్రాన్ వంటి ఇతర నాన్ వెజ్ కంటే చికెన్‌కే ప్రాధాన్యత ఇస్తుంటారు. ముఖ్యంగా మహిళలకు చికెన్ అంటే ఎక్కువ ఇష్టముంటుంది. అయితే చికెన్ కర్రీ తినే విధానం ప్రస్తుతం మారిపోయింది. గతంలో అంటే కొన్నేళ్లకు ముందు స్కిన్ అంటే విత్ స్కిన్ తీసుకునేవాళ్లు ఎక్కువగా. ఇప్పుడెందుకో వివిధ రకాల అపోహలు కావచ్చు, కాస్త నిజం కావచ్చు, కారణమేదైనా సరే స్కిన్‌లెస్ చికెన్ అనేది బాగా ప్రాచుర్యంలో వచ్చింది. స్కిన్‌లెస్ చికెన్ ప్రియులే ఎక్కువయ్యారు. 

స్కిన్‌లెస్ అంటే కోడిని మరుగుతున్న వేడినీటిలో ముంచి..కోడి ఈకల్ని చర్మంతో సహా ఒలిచేస్తారు. ఆ తరువాత ముక్కలుగా కోసిస్తారు. అదే విత్ స్కిన్ అయితే అదే మరుగుతున్న వేడి నీటిలో ముంచి తీసిన తరువాత ముందు కోడి ఈకల్ని తొలగిస్తారు. ఆ తరువాత పసుపు కొద్దిగా రాసి..మంటలో కాలుస్తారు. గతంలో అంటే పాతరోజుల్లో విత్ స్కిన్ ఎక్కువగా తినేవారు. ఇప్పుడు అలవాటు మారింది. అంతా స్కిన్‌లెస్ చికెన్‌కే అలవాటు పడ్డారు. కోడిచర్మం మంచిది కాదని..ఫ్యాట్ పేరుకుపోతుందని లేదా చర్మంలో ఓ రకమైన సూక్ష్మజీవులుంటాయని ఇలా వివిధ కారణాలతో, అపోహలతో స్కిన్‌లెస్‌కు అలవాటు పడిపోయారు. విత్ స్కిన్ అనేది దాదాపుగా మర్చిపోతున్నారు. 

అయితే హార్వర్డ్ స్కూల్ ఆఫ్ హెల్త్ అధ్యయనం కొత్త విషయాన్ని సూచిస్తోంది. పసందైన చికెన్‌ను విత్ స్కిన్‌నే తినమంటున్నారు. కోడిచర్మంలో అన్ శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయని..ఇవి అధిక రక్తపోటును నియంత్రిస్తాయని చెబుతున్నారు. గుండె పనితీరుని చికెన్ విత్ స్కిన్ మెరుగుపరుస్తుందని అంటున్నారు. అయితే మరుగుతున్న వేడి నీటిలో ముంచి ఈకలు తీసిన తరువాత..స్కిన్‌పై కొద్దిగా పసుపు రాసి బాగా కాల్చాల్సి ఉంటుంది. లేదా ఇంటికి తీసుకొచ్చిన తరువాత చికెన్ ముక్కల్ని మరోసారి వేడి వేడి నీటిలో ముంచి కడిగితే మంచిది. ఇలా చేయడం వల్ల ఏమైనా సూక్ష్మజీవులుంటే నాశనమవుతాయి. చికెన్ స్కిన్‌లో ఉండే ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు చాలా మంచిది. అలాగని ప్రతిసారీ విత్ స్కిన్ వద్దని కూడా అంటున్నారు. వారానికి 1-2 సార్లు విత్ స్కిన్ చాలంట. 

Also read: Indian Railways: ఛార్ట్ సిద్ధమైన తరువాత కూడా టికెట్ రద్దు చేసుకుంటే రిఫండ్, ఎలాగంటే, ఐఆర్‌సీటీసీ తాజా అప్‌డేట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News