Women Google Search: జీవితంలో పెళ్లి అనేది ఓ అందమైన, అనిర్వచనీయమైన మలుపు. అమ్మాయిల జీవితమైతే పెళ్లితో పూర్తిగా మారిపోతుంటుంది. పెళ్లికి ముందు అమ్మాయిలు గూగుల్‌లో ఏం సెర్చ్ చేస్తారో తెలుసుకుంటే..ఆశ్చర్యపోతారు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెళ్లి అనే రెండక్షరాలు అందరి జీవితాల్లో మలుపు తీసుకొచ్చినా..అమ్మాయిల జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంటుంది. నిజంగానే పెళ్లి అనేది అమ్మాయిల జీవితంలో పెద్ద మలుపు. జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. బహుశా అందుకే పెళ్లి విషయంలో అమ్మాయిల్లో ఓ రకమైన భయం ఉంటుంది. ఈ క్రమంలో పెళ్లికి ముందు అమ్మాయిలు చాలా ఆసక్తికరమైన అంశాల గురించి గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటారు. అవేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. 


పెళ్లికి ముందు అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల్లో ఓ రకమైన భయం ఉంటుంది దాంతోపాటు ఉత్సాహం కూడా అధికంగానే ఉంటుంది. ఈ క్రమంలో గూగుల్ సెర్చ్‌లో విచిత్రమైన అంశాల గురించి అణ్వేషిస్తుంటారు. ఎక్కువగా బట్టల గురించి అమ్మాయిలు గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటారు. పెళ్లిలో ఎలాంటి బట్టలు ధరించాలి, ఎలా మేకప్ ఉండాలనే విషయాలు కూడా సెర్చ్ చేస్తుంటారు. పెళ్లైన తరువాత ఎలాంటి వస్త్ర ధారణ ఉండాలనేది కూడా సెర్చ్ చేస్తుంటారు. 


పెళ్లి అంటే అబ్బాయిల కంటే అమ్మాయిలకే ఆసక్తి, ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో ఓ రకమైన భయం కూడా ఉంటుంది. పెళ్లి చేసుకునేందుకు సరైన వయస్సెంత అని అమ్మాయిలు ఎక్కువగా గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటారు. పెళ్లి చేసుకోవడం ద్వారా తొందరపడటం లేదు కదా అని కూడా తమకు తాము ప్రశ్నించుకుంటారట. పెళ్లి చేసుకునే వయస్సు ఇంకా రాలేదని..వయస్సు తక్కువే కదా అని అనుకుంటారట. ఇవే అభిప్రాయాల్ని గూగుల్ సెర్చ్‌లో అణ్వేషిస్తుంటారట.


అమ్మాయిలు పెళ్లికి ముందు ఓ విషయమై ఎక్కువ ఆందోళన చెందుతుంటారని తెలిసింది. కొత్త ఇంటికి అంటే అత్తారింటికి వెళ్లిన తరువాత ఎలా ఉంటుందో అని ఆలోచిస్తుంటారు. కొత్త ఇంట్లో ఇమడగలమా లేదా అని మధనపడుతుంటారు. ఈ ఆలోచనలతోనే పెళ్లైన తరువాత ఎలా ఆనందంగా ఉండాలంటూ గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటారు. అంతేకాదు కాబోయే అత్తగారి విషయంలో కూడా గూగుల్‌ను ప్రశ్నిస్తుంటారు.


Also read: Relationship Tips: కాబోయే భార్యను తొలిసారి కలవబోతున్నారా... అయితే ఈ టిప్స్ మీకోసమే...



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook