భారతీయుల వంటల్లో తప్పకుండా ఉండేది పచ్చిమిర్చి. పచ్చిమిర్చి లేకుండా భారతీయుల వంటనేదే ఉండదు. చాలామంది పచ్చిమిర్చిని రుచి కోసమే వాడుతుంటారనుకుంటారు. కానీ పచ్చిమిర్చితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలున్నాయని తెలియదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పచ్చిమిర్చిలో ఉండే క్యాప్సైకిన్ అనే రసాయనం స్పైసీగా ఉండటమే కాకుండా ఆరోగ్యకరమైన లాభాలు కూడా చేకూరుస్తుంది. తాజాగా ఉండే గ్రీన్ చిల్లీస్‌లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అటు ఎండు మిరపకాయల్లో మాత్రం విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. మిర్చిలోని బ్రైట్ కలర్..బీటో కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ బి, విటమిన్ ఇ, ఐరన్, పొటాషియంలు అధికంగా ఉన్నాయని సూచిస్తుంది. అసలు గ్రీన్ చిల్లీస్‌తో కలిగే ఐదు ముఖ్యమైన ప్రయోజనాలంటే పరిశీలిద్దాం..


పచ్చిమిర్చితో కలిగే ఐదు ఆరోగ్యకర ప్రయోజనాలు


చర్మ సంరక్షణ


గ్రీన్ చిల్లీస్‌లో పుష్కలంగా లభించే విటమిన్ సి కారణంగా చర్మం ఎక్కువ మొత్తంలో కొలాజెన్ విడుదల చేస్తుంది. మీ అందానికి మెరుగులు దిద్దడంలో విటమిన్ సి అనేది చాలా కీలకం. మీ చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్రీన్ చిల్లీలో ఉండే విటమిన్ ఇ కారణంగా ఏజీయింగ్ సమస్యను అదుపులో ఉండి..యవ్వనంగా కన్పిస్తారు.


అధిక బరువుకు చెక్


పచ్చిమిర్చిలో అసలు కేలరీలే ఉండవు. అందుకే ఇది బరువు తగ్గించుకోవాలనుకునేవారికి ఉపయోగకరం.  రోజూ మీ ఆహారంలో గ్రీన్ చిల్లీ భాగంగా చేసుకుంటే..బాడీ మెటబాలిజం అనేది 50 శాతం పెరుగుతుంది. ఇది వెయిట్ లాస్‌కు కారణమౌతుంది. 


మూడ్ ఛేంజర్


గ్రీన్ చిల్లీస్‌లో మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. ఇది యాంటీ డిప్రెంజెంట్‌లా పనిచేస్తుంది. ఇందులో ఉండే క్యాప్సైకిన్ రసాయనం ఇందుకు దోహదపడుతుంది. ఈ రసాయనం మెదడులోని ఫీల్‌గుడ్ హార్మోన్ ఎండోర్ఫిన్ స్థాయిని పెంచుతుంది. అందుకే విభిన్నమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందేందుకు మీ డైట్‌లో గ్రీన్ చిల్లీస్ భాగంగా చేసుకోండి. 


గుండె సంరక్షణ


గ్రీన్ చిల్లీస్ అనేవి రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. ఎథెరో స్క్లెరోసిస్ ముప్పు తగ్గుతుంది. మీ శరీరంలో ఇని హిబిటరీ ప్రభావాన్ని పెంచడంతో..బ్లడ్‌క్లాట్ ముప్పు తగ్గడమే కాకుండా గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది. 


పెయిన్ కిల్లర్‌గా


గ్రీన్ చిల్లీస్‌లో అద్భుతమైన యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలున్నాయి. ఫలితంగా శరీరంలోని పెయిన్ లెవెల్స్ తగ్గుతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్, ఆస్టియోపొరోసిస్ వంటి వ్యాధులున్నవారిలో ఇన్‌ఫ్లమేటరీ సమస్యల్ని దూరం చేస్తాయి. 


Also read: Weight Loss Diet: వ్యాయామం, డైట్ రెండింట్లో ఏది ముఖ్యం, బరువు తగ్గేందుకు తీసుకోవల్సిన పదార్ధాలివే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook