Hair Care Tips: ధృఢమైన, నిగనిగలాడే కేశాలు ఉండాలనేది ప్రతి అమ్మాయి కోరిక. ఎందుకంటే అందమైన కేశాలు అమ్మాయి అందాన్ని ద్విగుణీకృతం చేస్తాయి. కానీ వర్షాకాలంలో కేశాల సంరక్షణ ఎలా అనేది సమస్యగా మారుతుంటుంది. ఈ క్రమంలో మీ కోసం కొన్ని టిప్స్..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమ్మాయిలకు అందం పెంచేది అందమైన కేశాలే. కానీ వర్షాకాలంలో తరచూ కేశాలకు సంబంధించిన సమస్యలు ఎదురౌతుంటాయి. జుట్టు రాలడం, డ్రైగా ఉండటం, నిర్జీవంగా ఉండటం వంటివి ప్రధాన సమస్యలు. జుట్టు ఆరోగ్యంగా లేనప్పుడే ఇలాంటి సమస్యలు కన్పిస్తాయి. ఆధునిక బిజీ ప్రపంచంలో జీవనశైలి, దుమ్ము, ధూళికి ఎక్స్‌పోజ్ అవడం వల్ల జుట్టుకు సంబంధించిన ఈ సమస్యలు తలెత్తుతుంటాయి. అందుకే కేశాల సంరక్షణ చాలా అవసరం. మరి వర్షాకాలంలో కేశాల్ని ఎలా సంరక్షించుకోవాలనేది చూద్దాం..


కేశాలకు సంబంధించి ప్రధాన సమస్య నిర్జీవంగా ఉండటం. కేశాల్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు కొబ్బరి నూనె తప్పకుండా రాయాలి. రాత్రంతా జుట్టుకు కొబ్బరి నూనె పట్టించి..ఉదయం మైల్డ్ షాంపూతో స్నానం చేస్తే మంచి ఫలితాలుంటాయి. ఇలా చేయడం వల్ల హెయిర్ ఫాలిక్యుల్స్ ఆరోగ్యంగా ఉంటాయి. ఫలితంగా కేశాలు దట్టంగా పటిష్టంగా ఉంటాయి.


ప్రతి మూడు నెలలకోసారి ట్రిమ్మింగ్


కేశాలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి మూడు నెలలకోసారి ట్రిమ్ చేయాలి. దీనికోసం స్ప్లిట్ ఎండ్స్ కట్ చేస్తుంటే మరింత బలంగా మారతాయి. తరచూ హెయిర్ ట్రిమ్మింగ్ చేయడం వల్ల కేశాల వాల్యూమ్ పెరుగుతుంది. బయటకు వెళ్లేటప్పుడు ఎండ, వాన, వేడికి ఎక్స్‌పోజ్ కాకుండా కేశాల్ని కవర్ చేసుకోవాలి. స్టాల్, క్యాప్ లేదా టవల్‌తో కవర్ చేయవచ్చు. ముఖ్యంగా ఎండకు ఎక్స్‌పోజ్ కాకుండా చూసుకోవాలి. సీజన్ ఏదైనా సరే..షాంపూ వాడిన తరువాతే కండీషనర్ వాడాలనేది గుర్తుంచుకోవాలి. ఇలా చేయడం వల్ల కేశాల్లో డ్రైనెస్ తగ్గి..హైడ్రేట్‌గా ఉంటాయి.


Also read: Fitness tips: వ్యాయామం చేసే క్రమంలో కేవలం ఇలాంటి దుస్తువులను మాత్రమే వేసుకోవాలి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook