Hair Fall Desi Remedies: జుట్టు ముఖం అందాన్ని పెంచడానికి సహాయపడుతుంది. అయితే ఆధునిక జీవన శైలి కారణంగా ఆహారపు అలవాట్లు, కాలుష్యం కారణంగా జుట్టు రాలడం సాధారణ సమస్యగా మారింది. దీనితో పాటు జుట్టు క్రమంగా సన్నబడుతోంది. దీంతో చాలా మందిలో బట్టతల బారిన పడుతున్నారని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఆహారాలను ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒత్తు, దృఢమైన జుట్టును పొందడానికి తప్పకుండా ఎఫెక్టివ్ హోం రెమెడీస్ వినియోగించాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి ఇంటి చిట్కాలను పాటించడం వల్ల జుట్టు సమస్యలు తగ్గుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హెయిర్ ఫాల్ దేశీ రెమెడీస్:
ఉల్లిపాయ రసం:

ఈ ఉల్లిపాయ రసాన్ని తయారు చేసుకోవడానికి ఉల్లిపాయలను తొక్క తీసి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోంచి రసాన్ని గిన్నెలో వేరు చేయాలి. అయితే ఇలా తీసిన రసాన్ని ప్రతి రోజూ జట్టుకు అప్లై చేసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. జుట్టుకు అప్లై చేసే క్రమంలో తప్పకుండా మాసాజ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.


మెంతులు:
ఒక కప్పు మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. తర్వాత మరుసటి రోజు ఉదయం వీటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఆ తర్వాత ఈ పేస్ట్‌ను మీ జుట్టుకు బాగా అప్లై చేసి.. సుమారు 30 నుంచి 40 నిమిషాల పాటు ఉంచి శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వారంలో 1 నుంచి 3 సార్లు అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు పొందడమేకాకుండా జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది.


ఉసిరి పొడి:
ఒక గిన్నెలో ఒక చెంచా ఉసిరి పొడి తీసుకుని అందులో నీరు వేసి మిశ్రమంలా కలుపుకోవాలి. కావాలంటే అందులో కొన్ని చుక్కల నిమ్మరసం కూడా వేసుకుని కలుపుకోవచ్చు. తర్వాత ఈ పేస్ట్‌ను మీ జుట్టుకు బాగా పట్టించండి. ఆ తర్వాత దీనిని జుట్టుకు సుమారు 35 నుంచి 40 నిమిషాలు పాటు ఉంచండి. ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. కాబట్టి జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read:  jamuna death : టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ నటి జమున కన్నుమూత


Also Read: Sharwanand Engagement: ఘనంగా హీరో శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌.. వైరల్ పిక్స్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి