Hair Transplant: ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మంది జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. కొంతమందిలోనైతే చిన్న వయసుల్లోనే జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు మార్కెట్‌లో లభించే అతి ఖరీదైన నూనెలను వినియోగిస్తే మరికొందరు మాత్రం హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అనే శస్త్రచికిత్సా విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ ట్రీట్‌మెంట్‌లో భాగంగా తల భాగంపై ఉన్న అన్ని మూలల నుంచి జుట్టును తీసి బట్టతల ప్రాంతానికి మార్పిడి చేస్తారు. అయితే మీరు కూడా బట్టలతో బాధపడుతూ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాలని అనుకుంటున్నారా? ఈ విషయాలు తప్పకుండా గుర్తుంచుకోండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇన్ఫెక్షన్స్‌ వచ్చే ప్రమాదం ఉందా?:
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాలనుకునేవారు ఇన్ఫెక్షన్స్‌ సోకుతుందని వెనకడుగు వెస్తున్నారు. అయితే ఇన్ఫెక్షన్స్‌ రాకుండా ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత చాలా రకాల ఔషధాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. 


దురద సమస్య:
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత దురద సమస్యలు రావడం సర్వసాధరణం.. సరైన సమయంలో ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందలేక పోతే తీవ్ర వ్యాధులు కూడా వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. ఈ సమస్యతో బాధపడేవారు రోజూ షాంపూతో తలస్నానం చేయడం వల్ల కొంత వరకు అదుపులో ఉంటుంది.


Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!    


సాధారణ జుట్టులాగా కనిపిస్తుంది:
చాలా మందిలో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసిన జుట్టు సాధారణ జుట్టులాగే కనిపిస్తుంది. కాబట్టి ఆ జుట్టు పెరుగుతున్న కొద్దీ అలాగే ట్రీట్‌ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ ట్రీట్మెంట్‌ తర్వాత జుట్టును ఎంతో జాగ్రత్తగా కాపాడు కోవాల్సి ఉంటుంది. 


శాశ్వత జుట్టు రాలకుండా ఉండడానికి..
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసిన జుట్టు రాలకుండా ఉండడానికి  తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీరు ఈ జుట్టును చిన్న కట్‌ చేసి ఉంచుకోవడం వల్ల జుట్టు రాలకుండా ఉంటుంది. 


ఈ జాగ్రత్త తప్పనిసరి:
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న తర్వాత సుమారు 4-5 రోజుల పాటు సూర్యరశ్మి జుట్టుపై పడకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వైద్యులు సూచించిన మందులను కూడా వినియోగించాల్సి ఉంటుంది. 


Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!    



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook