Happy Makar Sankranti 2024 Wishes: మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఇలా సులభంగా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి!
Makar Sankranti Wishes: ఈ సంవత్సరం తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా మకర సంక్రాంతి పండగను జరుపుకుంటారు. ఈ పండగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఈ పండగను రోజు అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేయండి.
Happy Makar Sankranti 2024 Wishes: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మకర సంక్రాంతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సూర్యుడు మకర రాశిలోకి సంచారం చేయడం కారణంగానే మకర సంక్రాంతి అని పేరు వచ్చిందని పురాణాల్లో పేర్కొన్నారు. ఈ పండగను తెలుగు రాష్ట్ర ప్రజలు మూడు రోజులపాటు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజు నదీ స్నానాలను ఆచరించి సూర్యభగవానుడిని ప్రార్థిస్తారు. ఇలా చేయడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోయి.. జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ దూరమవుతాయని ఒక నమ్మకం ఇలాంటి ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండుగను కుటుంబంతో కలిసి జరుపుకోవడం అందరి అదృష్టం. అయితే ఈ పండగను పురస్కరించుకొని మేము అందించే శుభాకాంక్షలను మీ బంధుమిత్రులతో పంచుకోండి.
సంక్రాంతి శుభాకాంక్షలు మీకోసం:
సంక్రాంతి పండగ మీ జీవితంలో సుఖ సంతోషాలను కలిగించాలని కోరుకుంటూ.. మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ సంక్రాంతి పండగ మీ జీవితంలో చెడును తొలగించి మంచిని నింపాలని ఆకాంక్షిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
ఆ సూర్యభగవానుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు లభించి అన్ని పనుల్లో విజయం సాధించాలని మనసారా కోరుకుంటూ హ్యాపీ పొంగల్.
Also read: Makar Sankranti Foods: మకర సంక్రాంతి రోజున తప్పకుండా తినాల్సిన పిండి వంటలు ఇవే!
సూర్యుని కాంతి వలె మీ జీవితంలో కొత్త వెలుగులు నిండాలని మనసారా ఆకాంక్షిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మకర సంక్రాంతి ప్రత్యేక శుభాకాంక్షలు.
ఈ సంక్రాంతి మీకు ఓ వరంలా మారాలని ఆ భగవానుడిని ప్రార్థిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter