Mothers Day 2022 : రేపు మదర్స్ డే.. అసలు ఇది ఎలా మొదలైంది.. దీని ప్రాముఖ్యత ఏంటో తెలుసా..?
Happy Mothers day 2022 : రేపు మదర్స్ డే... మాతృతమూర్తుల దినోత్సవం... ప్రతీ బిడ్డ తన తల్లి పట్ల కృతజ్ఞతను, ప్రేమను చాటుకునే రోజు. మదర్స్ డే విశేషాలు మీకోసం..
Happy Mothers day 2022 : అమ్మ తనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓ సినీ కవి చెప్పినట్లు అమ్మే ఈ జగతికి మూలం అనడంలో అతిశయోక్తి లేదు. తన ప్రతిరూపం కడుపులో పడ్డ క్షణం నుంచి... బిడ్డ బయటకొచ్చే దాకా ఎన్నో కలలు కంటుంది అమ్మ. ప్రసవ వేదనను పంటి బిగువున అణచి బిడ్డకు జన్మనిస్తుంది. తన లాలనతో, పాలనతో బిడ్డను పెంచి పెద్ద చేస్తుంది. ఆపదొస్తే తన ప్రాణాలు అడ్డయినా బిడ్డను బతికించుకోవాలని చూస్తుంది. అందుకే ఈ జగత్తులో అత్యంత నిస్వార్థ జీవి ఎవరైనా ఉన్నారంటే అది కచ్చితంగా అమ్మే అని చెప్పాలి. రేపు 'ఇంటర్నేషనల్ మదర్స్ డే' సందర్భంగా... ఆ రోజుకు ఉన్న ప్రాధాన్యం, ఇతరత్రా విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం...
మదర్స్ డే తేదీ... దాని ప్రాముఖ్యత.. :
ఈసారి 'మదర్స్ డే' మే 8న వస్తోంది. ఇండియాలో ప్రతీ ఏటా మే రెండో ఆదివారాన్ని మదర్స్ డేగా జరుపుకుంటారు. తమకు జన్మనిచ్చిన తల్లులకు కృతజ్ఞతలు తెలిపేందుకు... వారి పట్ల ప్రేమను చాటేందుకు ఇది ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. తల్లుల పట్ల ప్రేమను ఒక రోజుకే పరిమితం చేయడమని కాదు కానీ... కనీసం ఒకరోజైనా వారి కోసం ప్రత్యేకంగా కేటాయించేందుకే మదర్స్ డేని జరుపుకుంటారు.
మదర్స్ డే చరిత్ర :
మదర్స్ డే తొలిసారిగా అమెరికాలో 1907లో జరుపుకున్నట్లు చెబుతారు. అన్నా జార్విష్ అనే మహిళ తన తల్లి జ్ఞాపకార్థం వెస్ట్ వర్జినియాలో నిర్మించిన మెమోరియల్ వద్ద మదర్స్ డే నిర్వహించారని... ఇదే తొలి మదర్స్ డే అని చెబుతారు. అంతకుముందు, 1905లోనే మదర్స్ డేని అధికారిక సెలవు దినంగా గుర్తించాలని జార్విస్ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నిర్వహించారు. అప్పట్లోనే ప్రజల ఆరోగ్య సమస్యలను నయం చేసేందుకు ఆమె మదర్స్ డే వర్క్ క్లబ్స్‌ను ఏర్పాటు చేశారు. సివిల్ వార్‌లో గాయాలపాలైన సైనికులకు సేవలందించారు. అన్నా జార్విష్‌తో పాటు జూలియవర్డ్ అనే మరో యాక్టివిస్ట్ అప్పట్లో 'మదర్స్ డే ఫర్ పీస్' అనే క్యాంపెయిన్‌ను చేపట్టారు.
Also Read: Mothers Day 2022: మదర్స్ డే స్పెషల్ విషెస్.. ఈ రోజంతా అమ్మతోనే సరదాగా గడిపేద్దాం!
Also Read: Rahul Gandhi On Kcr: కేసీఆర్ పేరు ఉచ్చరించని రాహుల్.. అసహ్యమా!వ్యూహమా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook