Rahul Gandhi On Kcr: తెలంగాణ పర్యటనలో కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ.. వరంగల్ రైతు సంఘర్షణ సభలో పాల్గొన్నారు. లక్షలాదిగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. దాదాపు 30 నిమిషాల పాటు మాట్లాడిన రాహుల్... తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ సర్కార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ పార్టీతో ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. తెలంగాణలో భారీగా అవినీతి జరుగుతుందని.. అన్ని వెలికితీస్తామని కూడా రాహుల్ గాంధీ ప్రకటించారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ.. ఎక్కడా కేసీఆర్ పేరును మాత్రం ఉచ్చరించలేదు. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.
తెలంగాణ ఉద్యమం, ఏర్పాటుపై మాట్లాడిన రాహుల్.. ఏ ఒక్కరి వల్లో రాష్ట్రం ఏర్పాటు కాలేదంటూ కేసీఆర్ ను టార్గెట్ చేశారు. గత ఎనిమిది ఏళ్లలో ఒక కుటుంబానికే ప్రయోజనం కలిగిందని అన్నారు కాని కేసీఆర్ పేరు ఎత్తలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి రాజులా వ్యవహరిస్తున్నారని కామెంట్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రికి ప్రజల సంక్షేమ పట్టదని మండిపడ్డారు. ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి అంటూ విమర్శలు చేశారో కాని కేసీఆర్ పేరు పలకలేదు రాహుల్ గాంధీ. అంతేకాదు పొత్తు విషయంలో క్లారిటీ ఇచ్చే సమయంలోనూ తెలంగాణ ప్రజలను మోసం చేసిన వ్యక్తితో కాంగ్రెస్ ఎప్పటికి కలవదని చెప్పారు రాహుల్ గాంధీ. అలాంటి వ్యక్తితో సన్నిహితంగా ఉండే నేతలు తమ దారి తాము చూసుకోవచ్చంటూ.. సొంత పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు రాహుల్ గాంధీ.
టీఆర్ఎస్ పార్టీ పేరును పలు సార్లు ఉచ్చరించిన రాహుల్.. కేసీఆర్ పేరు మాత్రం పలకలేదు. రాహుల్ ప్రసంగంపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది . రాహుల్ గాంధీ కావాలనే కేసీఆర్ పేరు పలకడానికి ఇష్టపడలేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు కేసీఆర్. తెలంగాణ ఇచ్చిన కృతజ్ఞత కూడా కేసీఆర్ లో లేదనే భావన కాంగ్రెస్ హైకమాండ్ లో ఉందంటున్నారు. బీజేపీతో కలిసి కాంగ్రెస్ పతనానికి కేసీఆర్ వ్యూహాలు రచించారనే కోపం కూడా రాహుల్ గాంధీలో ఉందంటున్నారు. ఇటీవల తెరపైకి వచ్చిన ప్రశాంత్ కిషోర్ ఎపిసోడ్ లోనూ కేసీఆర్ పాత్ర ఉందని ఏఐసీసీ నేతలు అనుకుంటున్నారని చెబుతున్నారు. మొత్తంగా బీజేపీకి ప్రధాన మద్దతుదారుగా కేసీఆర్ ఉన్నారనే భావనలో ఉన్న రాహుల్ గాంధీ.. అయన పేరు ఎత్తకుండానే వరంగల్ సభలో మాట్లాడారనే వాదన రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది.
READ ALSO: Ap Govt Loan:జీతాలకు డబ్బులొస్తున్నాయ్.. ఏపీ సర్కార్ మరో 3 వేల కోట్ల రుణం!
rahulgandhi permits visit chanchalguda: చంచల్‌గూడ జైలులో ములాఖత్‌కు రాహుల్‌కు అనుమతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook