Mothers Day 2022: ప్రపంచంలోని అత్యంత విలువైనది తల్లిబిడ్డల అనుబంధం. తల్లంటే పిల్లలకు.. పిల్లలంటే తల్లికి వెలకట్టలేని ప్రేమ ఉంటుంది. బిడ్డల కోసం తన అందమైన ప్రపంచాన్ని, కోరికలను తల్లి త్యాగం చేస్తుంది. అందుకే తల్లి అంటే పిల్లలకు ఎనలేని ప్రేమ ఉంటుంది. ఈ క్రమంలో తల్లుల కోసం ప్రత్యేకంగా ఒకరోజును కేటాయించారు. మే 8న (ఆదివారం) అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోనున్నారు.
సాధారణంగా తల్లి, తండ్రి, గురువు, దైవం అని పెద్దలు అంటుంటారు. ప్రపంచంలో తల్లి తర్వాతే ఎవరైనా అని అర్థం. ఆఖరికి దైవుడైనా తల్లి తర్వాతే ప్రాముఖ్యత అని తెలుస్తోంది. అంతటి మహానుభావురాలైన తల్లికి.. మదర్స్ డే రోజున మన ప్రేమను వ్యక్తపరుద్దాం. ఈ మదర్స్ డే రోజున మన అమ్మలకు ఏదైనా స్పెషల్ సర్ ప్రైజ్ రూపంలో లేదా వాళ్లు ఊహించని రీతిలో వాళ్లను సర్ ప్రైజ్ చేస్తే.. ఆ ప్రేమను వారి జీవితాంతం గుర్తుగా ఉంచుకుంటారు.
అయితే ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ ఇంటికి దూరంగా బతుకుతున్నారు. ఈ పరిస్థితుల్లో తమ తల్లులకు దూరంగా ఉండడం వల్ల వారి ఆలనాపాలనా చూసుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో మన తల్లి కోసం ఈ ఒక్కరోజును కేటాయిద్దాం. ఆ రోజంతా వారితోనే సరదాగా గడిపేద్దాం.
Also Read: Drinks for Low BP: లో బీపీకి చెక్ పెట్టాలంటే... ఈ డ్రింక్స్ తాగాల్సిందే..!
Also Read: Bath Mistake: అన్నం తిన్న తర్వాత తలస్నానం చేయొద్దు..ఆరోగ్యంపై అనేక ఎఫెక్ట్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.