Pineapple Halwa Recipe: పైనాపిల్‌ హల్వా టేస్ట్ ఎంతో రుచికరంగా ఉంటుంది. దీని తయారు చేసుకోవడం ఎంతో సులభం. హల్వా టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది.  పైనాపిల్‌తో తయారు చేస్తే దీని రుచి అదిరిపోతుంది. కేసరి కన్నా పైనాపిల్ కేసరిని పెడితే అద్భుతంగా ఉంటుంది. దీని వాసన కూడా నోరూరించేలా ఉంటుంది. పిల్లలకు , పెద్దలకు ఇది బాగా నచ్చుతుంది. మీరు ఈ డిష్‌ని పండుగలకు, ఎదైన రుచికరమైన వంట తినాలి అనిపించినప్పుడు దీని తయారు చేసుకొని తినవచ్చు. దీని పెద్దలు కూడా తీసుకోవచ్చు. పైనాపిల్‌లో ఎన్నో రకాల గుణాలు ఉంటాయి. కాబట్టి దీని ప్రతిఒక్కరు తినవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పైనాపిల్‌ హల్వాకి కావాల్సిన పదార్థాలు:



పైనాపిల్ ముక్కలు ఒకటిన్నర కప్పు, పంచదార నాలుగు స్పూన్లు,


కుంకుమపువ్వు చిటికెడు, నెయ్యి నాలుగు స్పూన్లు,


ఎండు ద్రాక్షలు  పావు కప్పు, పైనాపిల్ ఎసెన్స్ ఒక చుక్క,


రవ్వ ఒక కప్పు, జీడిపప్పు గుప్పెడు, 


పచ్చి యాలకులు, నీరు 


పైనాపిల్‌ హల్వా ఎలా తయారు చేసుకోవాలంటే:


ముందుగా కడాయిని ప్రీ హీట్‌ చేసుకోవాలి. ఇందులో గ్లాస్‌ నీరు పోసుకోవాలి. ఆ తరువాత పైనాపిల్ ముక్కలు, పైనాపిల్ ఎసెన్స్, పంచదార, కుంకుమపువ్వు వేసి ఉడికించాలి. పావుగంటసేపు ఉడికిస్తే చక్కెర పూర్తిగా కరిగిపోతుంది. ఉడికిన పైనాపిల్‌ను మెత్తగా అయ్యేలా బాగా కలుపుకోవాలి. మిశ్రమం అంతా నీళ్లగా కాకుండా కాస్త ముద్దలా అయ్యే వరకు ఉంచి స్టవ్ కట్టేయాలి.


మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ను నెయ్యి లో వేపుకొవాలి.  పాన్‌లో రవ్వ, యాలకుల పొడి వేసి వేయించాలి. ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసి వేయించాలి. రవ్వ గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. ముందుగా కలిపి పెట్టుకున్న పైనాపిల్ మిశ్రమాన్ని ఈ రవ్వ మిశ్రమంలో వేసి బాగా కలపాలి. 


మంటను తగ్గించి ఈ మొత్తం మిశ్రమాని బాగా కలుపుకోవాలి.  ఇందులోని నీరంతా ఆవిరి అయిపోయి హల్వాలా తయారయ్యాక పైన ఎండు ద్రాక్షను జల్లుకోవాలి.  ఈ విధంగా హల్వా రెడీ అవుతుంది.  దీని చక్కగా బౌల్ లో వేసుకొని ఎంజాయ్ చేయండి.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter