Anti Ageing Tips: అందంగా ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కొందరైతే వయస్సు పెరిగినా వృద్ధాప్యం మీదపడకుండా యౌవనంగా కన్పించాలని కోరుకుంటారు. అయితే ఆధునిక జీవనశైలి లేదా ఆహారపు అలవాట్లు లేదా కాలుష్యం కారణంగా వయస్సు పైబడిన తరువాత సంగతేమో గానీ యుక్త వయస్సుకే వృద్ధాప్య లక్షణాలు కన్పిస్తున్నాయి. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని సులభమైన హోమ్ రెమిడీస్ ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీర్ఘకాలం యౌవనంగా కన్పించేందుకు లేదా వయస్సు పైబడినా వృద్దాప్య లక్షణాలు రాకుండా ఉండేందుకు  చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కొందరైతే మార్కెట్‌‌లో లభించే వివిధ రకాల ఖరీదైన క్రీమ్స్ వినియోగిస్తుంటారు. వీటి వల్ల అందం సంగతేమో గానీ దుష్ప్రభావాలు ఎక్కువ. అయితే హోమ్ మేడ్ రెమిడీస్ లేదా హోమ్ మేడ్ ఫేస్‌ప్యాక్ ద్వారా ఏజీయింగ్ లక్షణాలకు చెక్ పెట్టవచ్చు. ఈ యాంటీ ఏజీయింగ్ ఫేస్‌ప్యాక్‌ను పెరుగు, శనగపిండి, పసుపు సహాయంతో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ మూడు పదార్ధాలు మీ చర్మాన్ని డీప్ నరిష్ చేసి ముడతల్లేకుండా, పింపుల్స్ లేకుండా చేస్తాయి. చర్మానికి నిగారింపు కూడా వచ్చి చేరుతుంది. 


వయస్సుతో పాటు ముఖంపై పెరిగే ముడతలు, మచ్చలు, పింపుల్స్ వంటివి వృద్ధాప్యాన్ని ముందే చూపించేస్తాయి. అయితే యాంటీ ఏజీయింగ్ ఫేస్‌ప్యాక్ వాడితే ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. పెరుగు, శెనగపిండి, పసుపులో ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్లు నిండి ఉంటాయి. ఇవి చర్మాన్ని చాలా లోతుగా నరిష్ చేస్తాయి. దాంతో చర్మంపై ముడతలు, పింపుల్స్  వంటివి దూరమౌతాయి. ఈ హోమ్ మోడ్ యాంటీ ఏజీయింగ్ ఫేస్‌ప్యాక్ వాడటం వల్ల దీర్ఘకాలం పాటు యౌవనంగా కన్పిస్తాము. 


యాంటీ ఏజీయింగ్ ఫేస్‌ప్యాక్ తయారు చేసేందుకు 2 స్పూన్ల శెనగపిండి, 2 స్పూన్ల పెరుగు, చిటికెడు పసుపు, 1 స్పూన్ అల్లోవెరా, అర స్పూన్ టొమాటో గుజ్జు అవసరమౌతాయి. యాంటీ ఏజీయింగ్ ఫేస్‌ప్యాక్ తయారు చేసేందుకు ముందుగా ఓ గిన్నె తీసుకోవాలి. ఇందులో శెనగపిండి, పసుపు, అల్లోవెరా, టొమాటో గుజ్జు, పెరుగు వేసి అన్నింటినీ బాగా కలుపుకోవాలి. బ్లెండ్ చేస్తే మంచిది. అంతే మీక్కావల్సిన యాంటీ ఏజీయింగ్ ఫేస్‌ప్యాక్ సిద్ధమైనట్టే.


యాంటీ ఏజీయింగ్ ఫేస్‌ప్యాక్ రాసేముందు ముఖాన్ని శుభంగా కడుక్కోవాలి. ఇప్పుడీ ప్యాక్‌ను ముఖంపై బాగా అప్లై చేయాలి. ఆ తరువాత ఓ 20 నిమిషాలు అలానే ఉంచి..సాధారణ నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్‌ను వారంలో 1-2 సార్లు రాసుకుంటే మంచి ఫలితాలుంటాయి. చాలా త్వరగా ముఖంపై ముడతలు, పింపుల్స్ వంటి సమస్యలు తొలగిపోయి ముఖంపై కాంతి వస్తుంది.


Also read: Weight Loss Tips: అధిక బరువుతో బాడీ షేప్ అవుట్ అయిందా, ఈ ఫ్రూట్ రోజూ తిని చూడండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook