Loss weight in 5 days with Pumpkin Juice: ఆధునిక జీవనశైలిలో ప్రధానంగా కన్పిస్తున్న స్థూలకాయం సమస్యతో మీరు సతమతమౌతుంటే.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ డైట్‌లో పంప్‌కిన్ లేదా గుమ్మడికాయ జ్యూస్ చేరిస్తే అద్భుతమైన ఫలితాలు కన్పిస్తాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా స్థూలకాయం అనేది ప్రస్తుతం సర్వ సాధారణమైన సమస్యగా ఉంది. స్థూలకాయం కారణంగా చాలా రకాల ఆరోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ డైట్‌పై ప్రధానంగా దృష్టి సారించాలి. మీరు కూడా ఇదే సమస్యతో బాధపడుతుంటే తక్షణం బరువు తగ్గించుకోవాలంటే గుమ్మడి కాయ జ్యూస్‌ను మీ డైట్‌లో చేరిస్తే మంచి ప్రయోజనముంటుంది.  గుమ్మడికాయ జ్యూస్‌లో విటమిన్లు, ఫైబర్, పొటాషియం, కాల్షియం వంటి పోషక పదార్ధాలుంటాయి. అంతేకాకుండా..విటమిన్ డి సైతం తగిన మోతాదులో లభిస్తుంది. విటమిన్ డి అనేది మొత్తం శరీరానికి చాలా అవసరం. 


గుమ్మడికాయ జ్యూస్ తయారీ ఎలా


గుమ్మడికాయ జ్యూస్ తయారు చేసేందుకు ముందుగా గుమ్మడికాయను చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. తరువాత తొక్క వేరు చేయాలి. ఆ తరువాత ఓవెన్ సహాయంతో బేక్ చేయాలి. బేకింగ్ తరువాత బాగా గ్రైండ్ చేసుకోవాలి. రుచి కోసం ఇందులో యాపిల్ ముక్కలు కలపవచ్చు. రెండింటినీ బాగా మిక్స్ చేస్తే జ్యూస్ రెడీ. రోజూ ఈ జ్యూస్ తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.


బరువు తగ్గించడంలో గుమ్మడి కాయ జ్యూస్ ప్రయోజనాలు


గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల ముందుగా జీర్ణం సరిగ్గా ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్య తొలగిస్తుంది. ఎప్పుడైతే మీ జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుందో..బరువు సహజంగానే తగ్గుతుంది. బరువు తగ్గేందుకు ఎప్పుడూ ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండే ఆహార పదార్ధాల్ని తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.


గుమ్మడి కాయ జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్‌ను నిర్మూలించడంలో సహాయపడతాయి. 


Also read: Kidney Health: మీ కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ మూడు డ్రింక్స్ తప్పకుండా తాగాల్సిందే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి