Health Benefits Of Milk: ప్రతిరోజూ ఓ గ్లాసు పాలు తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పాలలో చాలా పోషకాలు ఉన్నాయి, కొందరు పాలలో వారికి తోచిన పదార్థాలు వేసుకుని అల్పాహారం (Breakfast) సైతం చేస్తుంటారు. గ్రామాలలో వారి వద్ద ఉన్న పాడి జంతువులను బట్టి కొందరు ఆవు పాలు తాగితే మరికొందరు గేదె పాలు తీసుకుంటారు. కానీ ఆవు పాలు లేదా గేదె పాలు (Cow Or Buffalo Milk)లో దేనివల్ల ఎక్కువ ప్రయోజనమనే విషయాన్ని ఇక్కడ అందిస్తున్నాం. కొందరు మేక పాలు కూడా తాగినప్పటికీ పోషకాల విషయానికొస్తే ఆవు, గేదె పాలపై ఆసక్తి చూపుతారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆవు మరియు గేదె పాలు మధ్య వ్యత్యాసం
గేదె పాలు కంటే ఆవు పాలలో తక్కువ కొవ్వు ఉంటుంది. ఆవు పాలను తేలికైన పాలు అని కూడా చెబుతారు. ఆవు పాలు సులభంగా జీర్ణమవుతాయి. అందుచేత ఆవు పాలను పిల్లలకు కూడా ఇస్తారు. ఆవు పాలను ఒకటి రెండు రోజుల్లోనే తినాలి. గేదె పాల విషయానికొస్తే వీటిని మరికొంత కాలం నిల్వ చేసుకోవచ్చు. ఆవు పాలలో నీటి శాతం అధికంగా ఉంటుంది. మరోవైపు, గేదె పాలలో అయితే భాస్వరం, కాల్షియం, పొటాషియం మరియు మెగ్నీషియం (Health Benefits of Milk) వంటి ఖనిజ లవణాలు అధికంగా లభిస్తాయి.


Also Read: Foods To Eat During Covid-19: కరోనా నుంచి త్వరగా కోలుకునేందుకు ఈ ఆహారం తీసుకోండి


అదే పోషకాల విషయానికొస్తే ఆవు పాలలో కొవ్వు కాస్త తక్కువగా లభిస్తుంది. ఆవు పాలలో కొవ్వు 3-4 శాతం ఉండగా, గేదె పాలలో 7-8 శాతంతో అధికంగా కొవ్వు ఉంటుంది. ఆవు పాలు కంటే గేదె పాలలో ప్రోటీన్లు 10-11 శాతం ఎక్కువగా లభిస్తాయి. తక్కువ కొవ్వు ఉండే గేదె పాటు తాగడం ద్వారా మీకు రక్తపోటు, మూత్రపిండాల వ్యాధి మరియు ఊబకాయం లాంటి సమస్యలు తగ్గుతాయి. గేదె పాలు తాగడం ద్వారా ఇలాంటి అనారోగ్య సమస్యల (Milk Benefits) బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.


Also Read: Steroids for Covid-19 Treatment: ఆ కోవిడ్19 బాధితులకు స్టెరాయిడ్స్‌ వాడకం చాలా ప్రమాదకరం


గేదె పాలలో ఆవు పాలు కంటే కేలరీలు అధికంగా లభిస్తాయి. ఒక లీటరు కప్పు గేదె పాలలో 237 కేలరీలు లభించగా, అదే ఆవు పాల విషయానికొస్తే 148 కేలరీలు అందుతాయి. కెలరీలు, ప్రోటీన్లు విషయాలను పక్కనపెట్టి మీ శరీర తత్వానికి ఏ పాలు కావాలో ఈ వివరాల ఆధారంగా మీరు నిర్ణయించుకోండి. జీర్ణశక్తి ఎక్కువగా ఉన్నవారు గేదె పాలు తాగవచ్చు. మరీ బలహీనంగా ఉన్నవారు కొవ్వులు, ప్రోటీన్ల కోసం గేదె పాలు తీసుకోవచ్చు. రక్తపోటు, గుండె సంబంధింత సమస్యలున్నవారు ఆవు పాలు తాగడం ఉత్తమం.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook