Lemon Water Benefits: సన్నని నడుము, సిక్స్‌ప్యాక్ కావాలా, అయితే రోజూ నిమ్మకాయ నీళ్లు తాగితే చాలు
Lemon Water Benefits: ప్రకృతిలో లభించే వివిధ పదార్ధాలతోనే ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు. మందుల అవసరమే ఉండదు. అందులో ఒకటి నిమ్మకాయ నీళ్లు. నిమ్మకాయ నీళ్లతో కలిగే అద్భుత ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
Lemon Water Benefits: ప్రకృతిలో లభించే వివిధ పదార్ధాలతోనే ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు. మందుల అవసరమే ఉండదు. అందులో ఒకటి నిమ్మకాయ నీళ్లు. నిమ్మకాయ నీళ్లతో కలిగే అద్భుత ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
అధిక బరువుకు చెక్ పెట్టేందుకు చాలామంది నిమ్మకాయ నీళ్లను సేవిస్తుంటారు. వేసవిలో ఎండవేడి నుంచి ఉపశమనం పొందేందుకు కూడా లెమన్ వాటర్ తాగుతుంటారు. అంతకుమించి చాలామందికి తెలియదు. కానీ నిమ్మరసంతో చాలా ప్రయోజనాలున్నాయి. పటిష్టమైన, ఆరోగ్యమైన దేహం కోసం నిమ్మరసం లేదా లెమన్ వాటర్ తప్పకుండా తీసుకోవాలి. శరీరాన్ని డీటాక్స్ చేసేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. చెమట ద్వారా శరీరం నుంచి బయటకు పోయే పోషకాల్ని లెమన్ వాటర్ భర్తీ చేస్తుంది.
నిమ్మకాయలో ఏవి ఎంత మోతాదులో ఉంటాయి
నిమ్మరసంలో కొవ్వు అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఒక నిమ్మకాయలో 10 శాతం కార్బోహైడ్రేట్స్, 88-89 శాతం నీళ్లు ఉంటాయి. 100 గ్రాముల నిమ్మకాయలో 29 కేలరీలు, 1.1 గ్రామ్ ప్రోటీన్, 9.3 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 2.5 గ్రాముల పంచదార, 2.8 గ్రాముల ఫైబర్ ఉంటాయి. మరోవైపు నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి అనేది అతి ముఖ్యమైన విటమిన్, యాంటీ ఆక్సిడెంట్. ఇమ్యూనిటీని పెంచుతుంది. నిమ్మకాయలో పొటాషియం కూడా తగిన మోతాదులో ఉంటుంది. బ్లడ్ షుగర్ నియంత్రణకు దోహదపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఇందులో ఉండే విటమిన్ బి6 తినే ఆహారాన్ని ఎనర్జీగా మార్చడంలో దోహదపడుతుంది.
నిమ్మకాయ నీళ్లు ఎప్పుడు తాగాలి
నిమ్మరసం లేదా లెమన్ వాటర్ ఎప్పుడెప్పుడు తాగాలి, నిమ్మకాయ నీళ్లతో కలిగే దుష్పరిణామాలేంటనేది కూడా తెలుసుకోవాలి. నిమ్మకాయ నీళ్లు అధికంగా తీసుకుంటే లివర్‌కు హాని కలుగుతుంది. ఇక పళ్లపై ఉండే ఎనామిల్‌ను నష్టపరుస్తుంది. అదే సమయంలో నిర్ణీత మోతాదులో తీసుకుంటే మాత్రం లివర్ ప్రయోజనం చేకూరుస్తుంది. ఉదయం లేవగానే..నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.
బరువు తగ్గించేందుకు లెమన్ వాటర్
నిమ్మకాయ నీళ్లు బరువు తగ్గించే ప్రక్రియలో చాలా విరివిగా ఉపయోగిస్తుంటారు. వాస్తవానికి నిమ్మకాయ నీళ్లతో ఆకలి తగ్గిపోతుంది. మరోవైపు నిమ్మకాయ నీళ్లలో జీర్ణక్రియను మెరుగుపర్చే పోషకాలున్నాయి. ఇవి మెటబోలిజంను పెంచుతాయి. నిమ్మరసం భోజనాన్ని ఎనర్జీగా మారుస్తుంది. నిమ్మకాయ నీళ్లతో తిండి యావ తగ్గుతుంది.
సాధారణమైన నిమ్మకాయ నీళ్లకు బదులు..లెమన్ మింట్ వాటర్, లెమన్ కుకుంబర్ వాటర్, లెమన్ జింజర్ వాటర్, లెమన్ హనీ వాటర్ వంటి మిశ్రమాలు మరింత అద్భుత ప్రయోజనాల్ని అందిస్తాయి. నేరేడుతో పాటు నిమ్మకాయను సేవించవచ్చు. మరింత మెరుగైన ఫలితాల కోసం వేడి నీటిలో నిమ్మరసం కలిపి ఉదయం పరగడుపున తీసుకోవాలి.
నిమ్మరసం లేదా లెమన్ వాటర్ ప్రయోజనాలు
1. నిమ్మకాయలో పొటాషియం చాలా అధికంగా ఉంటుంది. అధిక రక్తపోటు కల్గించే ముప్పును తగ్గిస్తుంది.
2. నిమ్మకాయలో ఆరెంజ్, ద్రాక్షలానే ప్రోటీన్లు తగిన మోతాదులో ఉంటాయి. నిమ్మకాయను డైట్‌లో భాగంగా చేసుకుంటే చాలా లాభాలున్నాయి.
3. నిమ్మకాయ నీటిలో ఉండే విటమిన్ సితో యాంటీ ఏజీయింగ్ గుణాలు వృద్ధాప్య ఛాయల్ని దూరం చేస్తాయి.
4. నిమ్మకాయ నీళ్లు తాగడం వల్ల శరీరంలోని విష పదార్ధాలు బయటకు తొలగిపోతాయి.
5. శరీరాన్ని డీటాక్స్ చేసేందుకు నిమ్మకాయ నీళ్లు చాలా బాగా ఉపయోగపడతాయి. ఫలితంగా బరువు తగ్గేందుకు దోహదపడుతుంది.
6. ఎండలోంచి వచ్చినప్పుడు నిమ్మకాయ నీళ్లు తాగడం వల్ల ఫ్రెష్‌నెస్ వస్తుంది.
7. ఆటల సమయంలో నిర్ణీత మోతాదులో నిమ్మకాయ నీళ్లు తాగడం వల్ల క్రాంప్స్ దూరమౌతాయి.
8. వ్యాయామం చేసేటప్పుడు అలసట దూరం చేసేందుకు మద్య మధ్యలో నిమ్మకాయ నీళ్లు తాగడం మంచిది.
9. నిమ్మకాయలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వీటివల్ల స్వెల్లింగ్, పెయిన్స్ దూరమౌతాయి.
10. నిర్ణీత మోతాదులో నిమ్మకాయ నీళ్లు తాగడం వల్ల లివర్ ఆరోగ్యంగా ఉంటుంది.
Also read: Hair Mask: జుట్టుకు క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల.. కుదుళ్ల నుంచి బలంగా మారుతాయి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook