Diet to loss Belly Fat: స్థూలకాయం లేదా బెల్లీ ఫ్యాట్ లేదా రెండూ ప్రస్తుతం రోజుల్లో ప్రధానంగా కన్పిస్తున్న సమస్యలు. ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ డైట్‌లో మార్పులు చేస్తే..బెల్లీ ఫ్యాట్ నుంచి ఉపశమనం పొందవచ్చు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వర్కింగ్ స్టైల్ కారణాలతో ఎక్కువ మంది బెల్లీ ఫ్యాట్ లేదా స్థూలకాయంతో బాధపడుతున్నారు. మీరు కూడా బెల్లీ ఫ్యాట్ కారణంగా ఇబ్బంది పడుతుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ రెగ్యులర్ డైట్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేయడం ద్వారా బెల్లీ ఫ్యాట్ నుంచి విముక్తి పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ చిట్కాలు, డైట్‌లో మార్పుల గురించి తెలుసుకుందాం..


ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఉదయం వేళల్లో ఫ్లెక్స్ సీడ్స్ తీసుకోవాలి. అంటే మీ దినచర్య ఫ్లెక్స్ సీడ్స్‌తోనే ప్రారంభం కావాలి. ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. రాత్రి వేళ ఓ కప్పు నీళ్లలో ఫ్లెక్స్ సీడ్స్ వేసి నానబెట్టాలి. ఉదయం లేవగానే పరగడుపున నీళ్లు తాగి..గింజలు నమిలి తినాలి.ఫ్లెక్స్ సీడ్స్ తిన్న తరువాత..బ్రేక్‌ఫాస్ట్‌లో సాధ్యమైనంతవరకూ పెసర పప్పుతో చేసిన దోశను పుదీనా పచ్చడితో కలిపి తినాలి. ఇందులోని ప్రోటీన్లు శరీరం మెటబోలిజం అంటే జీవక్రియను మెరుగుపరుస్తాయి. పుదీనా పచ్చడి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 


తరువాత భోజనానికి ముందు యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవాలి. ఇది కూడా ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. ఓ కప్పు నీళ్లలో ఒక స్పూన్ వెనిగర్ కలిపి తాగేయాలి. ఇక స్నాక్స్ రూపంలో ప్రోబయోటిక్, మైక్రో న్యూట్రియంట్లు ఉండే చియా సీడ్స్ వంటివి మజ్జిగ, పండ్లతో కలిపి తీసుకోవాలి. ఇవి మీ కడుపును ఆరోగ్యంగా ఉంచుతాయి. డిన్నర్‌లో సాధారణ ఉప్పు కంటే పింక్ సాల్ట్ వాడటం మంచిది. ఇది ప్రేగుల పనితీరును మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ బాగుండి..మెటబోలిజం పటిష్టమౌతుంది. ఫలితంగా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. 


ఇక చివరిగా పంచదార స్థానంలో బెల్లం, తేనె, ఖర్జూరం వంటి సహజ సిద్ధమైన స్వీట్ కంటెంట్ ఉపయోగించాలి. వీటి వల్ల రోగ నిరోధక శక్తి మెరుగుపడటమే కాకుండా బెల్లీ ఫ్యాట్ నుంచి విముక్తి పొందుతారు. 


Also read: Stomache Infection: కడుపు ఇన్‌ఫెక్షన్ చాలా ప్రమాదకరం, ఆ లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయవద్దు



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook