Dehydration: మీ ముఖంపై ఆ లక్షణాలు కన్పిస్తున్నాయా..కారణం అదే
Dehydration: శరీరంలో నీటి కొరత కారణంగా సకల అనారోగ్య సమస్యలు ఎదురౌతాయి. నీరు తక్కువైతే..ముఖంపై కన్పించే ఈ లక్షణాల్ని పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయకూడదు.
Dehydration: శరీరంలో నీటి కొరత కారణంగా సకల అనారోగ్య సమస్యలు ఎదురౌతాయి. నీరు తక్కువైతే..ముఖంపై కన్పించే ఈ లక్షణాల్ని పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయకూడదు.
శరీరంలో నీటి కొరత కారణంగా చాలా రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. మరోవైపు తీవ్ర అలసట, కళ్లు తిరగడం, నోరు ఎండిపోవడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. అయితే శరీరంలో నీటి కొరత ప్రభావం వెంట్రుకలు, చర్మంపై కూడా కన్పిస్తుంది. నీరు తక్కువవడం వల్ల చర్మం ఎండిపోయి..నిర్జీవంగా ఉంటుంది. నీటి కొరత కారణంగా ముఖంపై కన్పించే కొన్ని లక్షణాల్ని మాత్రం పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఆ లక్షణాలేంటో చూద్దాం..
డ్రై స్కిన్
చాలామందికి శరీరంలో నీరు తక్కువ కావడం వల్ల చర్మం డ్రై అంటే ఎండిపోతుంది. శరీరంలో నీటి కొరత కారణంగా చర్మం డీ హైడ్రేట్ అవుతుంది. ఆ కారణంగా ఎక్కువగా ఎండిపోయినట్టు కన్పిస్తకుంది. అందుకే మీ చర్మం డ్రైగా ఉంటే పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయవద్దు.
పెదవులపై..
పెదవులపై ఓ విధమైన పొర పేరుకుపోవడం డీ హైడ్రేషన్ స్కిన్ లక్షణాల్లో ఒకటి. శరీరంలో నీటి కొరత కారణంగానే పెదవులపై ఇలా వస్తుంది. అంటే డెడ్ స్కిన్ కణాలు పేరుకుపోతే ఇలా కన్పిస్తుంది. అంతేకాదు..శరీరంలో నీటి కొరత వల్ల పెదవులు చీలిపోతుంటాయి కూడా.
చర్మం దురద
చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు నిర్ణీత మొత్తంలో నీరు తాగడం చాలా అవసరం. డీ హైడ్రేషన్ కారణంగా మీ చర్మంలో దురద వంటి లక్షణాలు కన్పిస్తాయి. దాంతోపాటు చర్మంపై దురద, ర్యాషెస్ సమస్యలు కూడా ఎదురౌతాయి.
ముడతలు
వయసు పెరిగే కొద్దీ..ముఖం, చేతులపై ముడతలు లేదా చర్మం కుదించుపోవడం వంటి సమస్యలు వస్తాయి. కానీ మీ ముఖంపై కూడా ఇలాంటి ముడతలు కన్పిస్తే..పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయవద్దు. నీటి కొరత ఒక్కటే ఈ లక్షణానికి కారణం.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook