Garlic benefits: వామ్మో... వెల్లుల్లి తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయా?
Garlic benefits: వెల్లుల్లిని ఔషధాల గని అంటారు. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. వెల్లుల్లిని రోజూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎన్నో వ్యాధులు దూరమవుతాయి.
Garlic benefits: వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గార్లిక్ ను రోజూ తినడం వల్ల ఎన్నో రోగాలు దూరమవుతాయి. దీనిని రోజూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఓసారి తెలుసుకుందాం.
వెల్లుల్లి ప్రయోజనాలు
** వెల్లుల్లిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల జలుబు, ఊపిరితిత్తులకు సంబంధించిన దూరమవుతాయి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాల కారణంగా గొంతు సమస్యలు రాకుండా ఉంటాయి.
** వెల్లుల్లి తినడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ఎందుకంటే ఇందులో ఉండే యాంటీ క్లాటింగ్ గుణాలు గుండెకు రక్తప్రసరణ జరగడాన్ని మెరుగుపరుస్తుంది. తద్వారా గుండెపోటు రాకుండా ఉంటుంది.
** బరువు తగ్గాలనుకునేవారికి వెల్లుల్లి మంచి ఔషధం. దీనిలోఉండే అలిసిన్ అనే పదార్థం శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
** రోజూ గార్లిక్ ను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల రక్తహీనత నుంచి ఉపశమనం పొందవచ్చు.
** వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మెండుగా ఉంటాయి. ఇది తీసుకోవడం వల్ల అల్జీమర్స్, డిమెన్షియా వంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది.
** మీ లివర్ ను ఆరోగ్యం ఉంచడంలో వెల్లుల్లి సూపర్ గా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇది డయేరియాను దూరం చేస్తుంది.
** వెల్లుల్లి ఒత్తిడిని తగ్గించి... ఆక్సిజన్ స్థాయిలను పెంచుతుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Oral Cancer: మీరు తరుచూ ఆ పని చేస్తున్నారా.. అయితే మీకు నోటి క్యాన్సర్ ఉన్నట్లే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.